28.7 C
Hyderabad
April 28, 2024 07: 01 AM
Slider జాతీయం

మన మధ్యే తిరుగుతున్న స్లీపర్ సెల్స్

#ISISTerrorist

బెంగళూరులో డాక్టర్ గా పని చేస్తూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐస్ కు స్లీపర్ సెల్ గా ఉన్న ఒక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది.

గాయ‌ప‌డ్డ ఐసిస్‌ ఉగ్ర‌వాదుల‌కు వైద్యస‌హాయం అందించేలా మెడిక‌ల్ యాప్, ఆయుధాల‌కు సంబంధించిన యాప్‌ను రూపొందిస్తున్నాడ‌నే ఆభియోగాల‌పై బెంగ‌ళూరుకు చెందిన డాక్ట‌ర్ అబ్దుల్ రెహ‌మాన్ (28)ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అబ్దుల్ రెహ‌మాన్ బెంగ‌ళూరులోని ఎమ్మెఎస్ రామ‌య్య మెడిక‌ల్ కాలేజీలో కంటి డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. అత‌నికి ఇస్లామిక్ స్టేట్ ఖోరాస‌న్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) సంస్థ‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాడ‌ని అధికారులు తెలిపారు.

అబ్దుల్ రెహ‌మాన్ 2014 ప్ర‌థ‌మార్థంలో సిరియాలో ఏర్పాటుచేసిన ఐసిస్ మెడిక‌ల్ క్యాంప్‌కు హాజ‌ర‌య్యాడ‌ని, అక్క‌డ ఉగ్ర‌వాదుల‌కు ప‌ది రోజుల‌పాటు వైద్యం చేశాడ‌ని, అనంత‌రం భార‌త్‌కు తిరిగి వ‌చ్చాడ‌ని అధికారులు ప్ర‌క‌టించారు. తిరిగి వచ్చిన తర్వాత అతను ఐసిస్ ఉగ్రవాద సంస్థకు స్లీపర్ సెల్ గా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Related posts

కరోనాతో తొలి తెలుగు జర్నలిస్టు మరణం

Satyam NEWS

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం

Bhavani

కేసు దర్యాప్తు చేయని పోలీసులకు హైకోర్టు అక్షింతలు

Satyam NEWS

Leave a Comment