40.2 C
Hyderabad
May 1, 2024 16: 38 PM
Slider హైదరాబాద్

అవినీతి కంపు: తొలగించిన ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

#GHMC

మునిసిపాలిటీలో లంచాల కథ ఎలా ఉంటుందో ఈ సంఘటన కళ్లకు కడుతున్నది. పాలకులు పెద్ద పెద్ద మాటలు చెబుతారు తప్ప అవినీతిని నిర్మూలించడంలో మాత్రం ఏ మాత్రం చొరవ చూపరనేది నిష్టుర సత్యం.

హైదరాబాద్ లిబర్టీ లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఈ అవినీతి భాగోతం బయటకు వచ్చింది.

రమేష్ యాదవ్ అనే అతను అబిడ్స్ సర్కిల్ 14 లో గత పదిహేనేళ్ళగా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఉమ గౌరీ ప్రతి నెల డబ్బులు ఇవ్వాలని అతడిని వేధించేవారట.

తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో తనను ఉద్యోగం నుండి తొలిగించి, అన్యాయం చేసారని అతను వాపోతున్నాడు.

ఎలా బతకాలో తెలియక రమేష్ యాదవ్ తన భార్యతో సహా వచ్చి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహ్యతకు యత్నించాడు.

సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

Related posts

మ‌ట్టిదొంగ‌ల్ని వ‌దిలేసి..పోరాడే ధూళిపాళ్ల‌ని అరెస్ట్ చేస్తారా?

Satyam NEWS

కూరగాయలు పంచిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్

Satyam NEWS

అవినీతికి పాల్పడ్డ ఐఏఎస్ లు మొత్తం 65 మంది….

Satyam NEWS

Leave a Comment