Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూలు జిల్లా లో వేసవి శిక్షణ శిబిరాలు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు సాంస్కృతిక కార్యకలాపాలపై ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.

బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వేసవి శిక్షణ తరగతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో ప్రత్యేకంగా బాలభవన్ లేకపోవడం వల్ల వేసవిలో ఆహ్లాదకరంగా సాంస్కృతిక శిక్షణ పొందే అవకాశం లేదని దీనిని అధిగమించడానికి జిల్లాలో తాత్కాలిక వేసవి శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.

పాటలు పాడటం, నృత్యాలు, చిత్రలేఖనం, చేతి వ్రాత, ఇండోర్ ఆటలు చెస్, క్యారమ్ బోర్డు వంటి విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన శిక్షకులు, ఇంస్ట్రుమెంట్, శిక్షణ స్థలం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులకు ఈ ప్రత్యేక శిక్షణ శిబిరంలో నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రెండు రోజుల్లో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం కావాలని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

బి.సి సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, జి.యం ఇండస్ట్రీస్ హన్మంతు నాయక్, ఈ.డి ఎస్సి కార్పొరేషన్ రాంలాల్, పి.ఓ ఐ.టి.డీఏ అశోక్, జిల్లా సంక్షేమ అధికారిణి ఇంచార్జి దమయంతి తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, నాగర్ కర్నూలు జిల్లా

Related posts

విశాఖలో బ్రాహ్మణ అభ్యుదయ సమాజం వనసంతర్పణ

Satyam NEWS

ప్రేమాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ దంపతులు

Satyam NEWS

కాకతీయతో జల సిరిలొలుకుతున్న చెరువులు

Satyam NEWS

Leave a Comment