30.7 C
Hyderabad
April 29, 2024 06: 49 AM
Slider ప్రత్యేకం

తీవ్రతుపాను నుంచి తుఫానుగా బలహీనపడిన అసని

#heavyrains

తీవ్రతుపాను నుంచి తుఫానుగా అసని బలహీన పడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలింది. మచిలీపట్నంకు 50 కి.మీ., కాకినాడకు 150 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 530 కి.మీ., పూరీకు 640 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.

కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. నరసాపురం వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉంది.

రేపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ డైరెక్టర్ తెలిపారు.

Related posts

మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

Satyam NEWS

ఇసుక రవాణాను అడ్డుకున్న కథగా౦ గ్రామస్తులు

Satyam NEWS

వేంచేయవమ్మా ….

Satyam NEWS

Leave a Comment