40.2 C
Hyderabad
April 29, 2024 17: 07 PM
Slider సినిమా

షూటింగ్ మొదలు పెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు

#SuperstarMaheshBabu

సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ మొదలెట్టేశాడు. కరోనాతో దాదాపుగా మూడు నాలుగు నెలలుగా సినిమా షూటింగ్ లు ఆగిపోయిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం అనుమతి ఇచ్చినా పలురకాల అనుమానాలతో చాలా సినిమాలు ప్రారంభం కాలేదు. కొన్ని సినిమాల షూటింగ్ ప్రారంభం అయినా అవాంతరాలు వస్తూనే ఉన్నాయి.

షూటింగ్ మధ్యలో ఎవరో ఒకరికి కరోనా పాజిటీవ్ రావడంతో షూటింగ్ లకు విరామం ఇవ్వాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఏ పెద్ద హీరో కూడా షూటింగ్ లకు రావడం లేదు.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం వాటన్నింటికి భిన్నంగా సెట్స్ పైకి వచ్చేశారు. ఒక యాడ్ ఫిలిం షూటింగ్ లో ఆయన నేడు పాల్గొన్నారు. షూటింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్నది.

ఈ యాడ్ ఫిలిం షూటింగ్ రేపు కూడా జరుగుతుంది. షూటింగ్ ల పరంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ముందడుగు వేసినట్లు చెప్పవచ్చు.

Related posts

జగన్ ప్ర‌భుత్వ‌ హ‌యాంలో ప్ర‌తీ పేదవానికి ల‌బ్ది

Satyam NEWS

ట్రాజిక్:బ్రిడ్జిపై నుండి వ్యాన్ బోల్తా 8మంది మృతి

Satyam NEWS

ఈ పసిపిల్లలకు ఉన్న జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుందో……?

Satyam NEWS

Leave a Comment