32.2 C
Hyderabad
May 2, 2024 01: 28 AM
Slider కరీంనగర్

రిక్వెస్టు: పసుపు పంటకు 15వేలు మద్దతు ధర కావాలి

turmaric

పసుపు పంటకు పదిహేను వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక జగిత్యాల జిల్లా కలెక్టర్ కు నేడు వినతి పత్రం అందచేసింది. 176 మంది కర్షకులు రాజకీయాలకు అతీతంగా  పార్లమెంట్ బరిలో నిలిచి రైతులంటే ఏమిటో దేశానికి వెల్లడించారని, రైతులందరి కృషికి ఫలితమే సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు జరిగిందని జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి తెలిపారు.

ఆ బోర్డుతో రైతులకు ఎంత లాభమూ ఎంత నష్టమూ తరువాత విషయం. ఎందుకంటే ఇది పసుపు పంట చేతికి వచ్చిన సమయం. ఇంకో వారం లోపు  పసుపు పంట అమ్ముకునే సమయం. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్న బోనస్ మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బోనస్ ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ్యాలి.

కేంద్ర ప్రభుత్వం తక్షణమే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలి. ఇప్పుడు రాకపోతే ఇంకెప్పటికి పసుపుకు మద్దతు ధర రాదు. ప్రతి రైతు రోడ్డు ఎక్కి మన పంటకు గిట్టుబాటు ధర కోసం పోరాడే సమయం ఆసన్నమైందని తిరుపతి రెడ్డి అన్నారు.

Related posts

తండ్రి కుమార్తెను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Satyam NEWS

చిన జియర్ డెంగ్యూ ట్రస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్

Satyam NEWS

కుట్ర ఎవరు చేశారో వై ఎస్ షర్మిలే చెప్పాలి

Satyam NEWS

Leave a Comment