24.2 C
Hyderabad
July 20, 2024 17: 54 PM
Slider ముఖ్యంశాలు మెదక్

చిన జియర్ డెంగ్యూ ట్రస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్

jagga reddy jeeyar

బాగా డబ్బులు ఉన్న భక్తులతో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి డెంగ్యూ ఫీవర్ బాధితులను చిన జియర్ స్వామి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదని, ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు డెంగ్యూ ఫీవర్ తో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. డెంగ్యూ ఫీవర్ వస్తే 60 వేల నుంచి 1లక్ష రూపాయల వరకూ ఖర్చు అవుతున్నదని ఆయన అన్నారు. రాష్ట్రంలో మెడికల్ డిపార్ట్మెంట్ ఉందా అన్న ప్రశ్న తలెత్తుతున్నదని ఈ దశలో రాష్ట్రాన్ని చిన జియర్ స్వామి ఆదుకోవాలని జగ్గారెడ్డి కోరారు. చిన్నజీయర్ స్వామి దగ్గరికి కేసీఆర్, జగన్, రమేశ్వరరావు లాంటి వెళ్తున్నారు. అందువల్ల ఆయన తన పరపతిని ఉపయోగించి మనవతాదృక్పధంతో ఇలాంటి ట్రస్ట్ ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేయాలి ఈ మేరకు చిన్నజీయర్ స్వామికి లేఖ రాస్తాను అని జగ్గారెడ్డి అన్నారు.

Related posts

పైడితల్లి అమ్మ వారి జాతరపై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమీక్ష…!

Satyam NEWS

నవంబర్ 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Satyam NEWS

లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకు వేళలు మార్పు

Satyam NEWS

Leave a Comment