40.2 C
Hyderabad
May 6, 2024 18: 55 PM
Slider అనంతపురం

జర్నలిజం పైన ప్రభుత్వాల నిర్బంధం దుర్మార్గం…..

#press

జర్నలిస్టుల పై కేసులు మీడియా సంస్థలపై దాడులు చేయించడం నియంతృత్వ విధానమని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కడప వైయస్సార్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. జర్నలిస్టులపై దాడులు అక్రమ కేసులు మీడియా సంస్థల పైన ప్రభుత్వ ఏజెన్సీల నిర్బంధ చర్యలు ప్రజాస్వామ్య మనుగడకే పెనుముప్పుల మారిందని పలు రాజకీయ పార్టీల, నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు ఇతర వ్యవస్థలను తన సొంత అవసరాలకు వినియోగించు కుంటూ ప్రతిపక్ష పార్టీలను, పత్రికలను,రచయితలు ప్రజాసంఘాల ప్రతినిధులను ఎన్ఐఏ పేరుతో ,ఈడి , ఐటి దాడులతో వేధింపులకు గురి చేస్తుందని రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కన్వీనర్ చంద్రమోహన్ రాజు ఆరోపించారు.

ప్రింట్ , ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా సంస్థలపై దాడులు చేయించి జర్నలిస్టులకు కొన్ని మీడియా యజమాన్యాలకు తీవ్రత సంస్థలతో, పొరుగు దేశాలతో సంబంధాలు ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయడం దుర్మార్గమని విమర్శించారు . ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ  ఢిల్లీలోనే ఆప ప్రభుత్వంపై పెత్తనం చేయడానికి ఒక ఆర్డినెన్స్ ఉపయోగించి మోడీ ప్రభుత్వం తన నిరంకుశ విధానాన్ని అమలు చేస్తోందని విమర్శించారు.న్యూస్ క్లిక్ సంస్థ పై దాడులు చేయడమే కాకుండా ఎన్ డి ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులపై కేసు నమోదు చేస్తోందని విమర్శించారు .

సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంటిపై దాడులు చేసి ఇంట్లోని, సామాగ్రిని దర్యాప్తు సంస్థలు ఎత్తుకెళ్లడాన్ని ఆయన దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అలంఖని పల్లి లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ దేశం కోసం , ప్రజల కోసం ప్రభుత్వాల మెరుగైన పనితీరు కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడులు చేయడం దుర్మార్గమని విమర్శించారు.

ప్రజాస్వామ్యవాదులు మేధావులు ఈ పరిస్థితిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర మాట్లాడుతూ దేశంలో ఒక రకమైన ఎమర్జెన్సీ పరిస్థితులు ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని ధ్వజమెత్తారు. మీడియానే లేకపోతే ఇక ప్రజాస్వామ్యం ఉండబోదని ఆవేదన వ్యక్తం చేశారు . రాజకీయ పార్టీల విధానాలు వారి పార్టీల వరకే ఉండాలని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలన్నారు. కాకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి వ్యవస్థను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని తమ అంతర్గత అజెండాలను ప్రజలకు రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

మైనారిటీలను దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తే ఎలా?

దేశ స్వాతంత్రం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయని భారతీయ జనతా పార్టీ సంఘ పరివార్లు ఇప్పుడు దేశంలోని ప్రజాస్వామ్య వాదులను మైనారిటీలను అభ్యుదయ వాదులను దేశ విద్రోహులుగా, తీవ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు . ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి వాళ్ళ దృష్టి మరల్చి తమ ఫ్యాసిరిస్టు విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. దేశంలో జరుగుతున్న అరాచకాలు అన్ని మోడీ ప్రభుత్వం లోని ఏజెన్సీల ద్వారా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ చరబగీతం పాడేందుకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు రచయితలు అంతా కలిసి పోరాటం సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ప్రముఖ సంఘ సేవకుడు సలావుద్దీన్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు కూడగట్టి మరిన్ని పోరాటాలకు తాను సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలను కూడగట్టి ఈ దుర్మార్గపు నిర్బంధాన్ని తుదముట్టించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ మీడియా గొంతును కోసేందుకు ప్రజాస్వామ్యాన్ని నిలువెత్తున పాతరేసేందుకు నరేంద్ర మోడీ ఎంతటి కఠినమైన చర్యల కైనా పూనుకుంటారని విమర్శించారు.

వీటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత వామపక్షాలు , ప్రజాస్వామ్యవాదులు తీసుకోవాలన్నారు . ప్రజల వార్తలు , బడుగు బలహీన వర్గాల వార్తలు, ఆదివాసీలు ,మైనారిటీల వార్తలు రాస్తే ఈ ప్రభుత్వానికి గిట్టదని విమర్శించారు . హిందూ ముస్లింల మధ్య వివాదం సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం విష ప్రచారాల ద్వారా చేస్తున్నాయి అన్నారు . కొన్ని కార్పొరేట్ మీడియా సంస్థలను చేతిలో పెట్టుకొని ప్రజా పక్షం వహించే మీడియా కు సంకెళ్లు వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు రచయిత వనం దత్త ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఇటీవల కాలంలో మీడియా సంస్థలు జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఈ దాడులు ప్రజాస్వామ్యం మీద జర్నలిస్టు సమాజం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనుకున్నదే సాధించేందుకు ఎవరు ప్రశ్నించినా వారిని అణిచివేసేందుకు అన్ని విధాల యంత్రాంగాలు నిర్బంధంగా పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాది గుర్రప్ప ,  ప్రజాశక్తి రిపోర్టర్ ఫెడరేషన్ నాయకులు నూర్ భాషా , సిద్దయ్య ,నారాయణ , ప్రజా సంఘాల నాయకులు నందకుమార్ రాజు, ఎస్ మురళి, తెలుగుదేశం నాయకులు కొండా సుబ్బయ్య , లోక్సత్తా నాయకులు కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్ శ్రీనివాసులు, జర్నలిస్టులు నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రారంభం కాక ముందే సక్సెస్ అయిన లోకేష్ పాదయాత్ర

Bhavani

సుదీర్ఘ చర్చల తరువాత ‘హైదరాబాద్’ డిక్లరేషన్ కు ఆమోదం

Satyam NEWS

వెంకట రమణారెడ్డిని ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment