29.7 C
Hyderabad
May 1, 2024 07: 03 AM
Slider ప్రత్యేకం

కరోనా మందుల పేరుతో మోసంపై కేంద్రానికి సుప్రీం నోటీసు

#Supreme Court

కరోనా చికిత్సలో విరివిగా వినియోగిస్తున్న రెమిడిస్వేర్, ఫావిపిరవేర్ మందులను వినియోగించేందుకు కేంద్రం అనుమతి ఉందా లేదా చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ రెండు మందులు ఉత్పత్తి చేసే కంపెనీలు తమ ప్రకటనలతో మార్కెట్ లో విస్తృత ప్రచారం చేసుకుని కరోనా చికిత్సలో ఈ మందులు వాడేలా చేసుకుంటున్నారని, వాస్తవానికి ఈ మందులతో కరోనా చికిత్సలో ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపిస్తూ ఎం ఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎఏ బాబ్డే, జస్టిస్ ఏ ఎస్ బొపన్నా, జస్టిస్ వి సుబ్రహ్మణ్యియన్ ల బెంచ్ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) చేసిన అనేక పరిశోధనల్లో ఈ రెండు మందులు కరోనా రోగులకు పని చేయడం లేదని తేలినట్లు ఉన్న పత్రాలను న్యాయవాది శర్మ కోర్టుకు సమర్పించారు. ఈ పరిశోధనలను చైనా వారు అమెరికా వారు కూడా ఆమోదించారని ఆయన కోర్టు కు విన్నవించారు.

ఈ మందులను విరివిగా వినియోగిస్తున్న డాక్టర్లపైనా, సరఫరా చేస్తున్న సంబంధిత కంపెనీలపైనా ఔషధ నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు.

ఈ మందులు వాడినా కరోనా తగ్గని వారికి నష్ట పరిహారం ఇప్పించాలని, ఈ మొత్తం తతంగంపై సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.

Related posts

పైకి అభయం లోన భయం కరోనా పై వైసీపీ నేతల తీరు

Satyam NEWS

హైకోర్టు అదనపు న్యాయమూర్తుల బాధ్యతల స్వీకరణ

Bhavani

ఒంటిమిట్ట చెరువు పై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భత్యాల సెల్ఫీ ఛాలెంజ్

Satyam NEWS

Leave a Comment