28.7 C
Hyderabad
April 26, 2024 09: 55 AM
Slider ప్రకాశం

ఎస్ సి ల భూమి ఆక్రమించిన వైసీపీ నేతకు హైకోర్టు నోటీసు

#amanchkrishnamohan

ప్రజాప్రతినిధి అయితే ఏ భూమి అయినా కబ్జా చేసేయవచ్చా? నిక్షేపంగా ఏ భూమినైనా కబ్జా చేసుకోవచ్చు…. మేం రాజకీయాల్లోకి వచ్చింది అందుకే కదా? అనే నాయకులు కూడా ఉన్నారు.

అయితే అలాంటి నాయకుల్ని ప్రశ్నించే వారు కూడా ఉంటారు. చీరాల మాజీ ఎమ్మెల్యే, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామ రెవిన్యూ సర్వే నంబరు72/3(మాలపల్లి గ్రామకంఠం) భూమిని చట్ట విరుద్ధంగా ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేసిన విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. విజిల్ బ్లోయర్ నాయుడు నాగార్జునరెడ్డి ఇదే విషయాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ దృష్టికి ఏడాది కిందట తీసుకువెళ్లారు.

అయితే జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విజిల్ బ్లోయర్ నాగార్జున రెడ్డి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా తమకు అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఎన్నో ఆరోపణలకు కేంద్ర బిందువైన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ఏం సమాధానం చెబుతారా అని జిల్లా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.

ఫిర్యాదు విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్  వేటపాలెం మండలం పందిళ్లపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నెం 72-3 పూర్తి విస్తీర్ణం 2.46 సెంట్లు ఎఫ్ ఎల్ ఆర్ దాఖలా పోరంబోకు గ్రామ కంఠం మాలపల్లి (ప్రభుత్వ భూమి)ని చట్ట వ్యతిరేకంగా కొనుగోలు చేశారు.

గ్రామ కంఠం భూములను ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చేయరాదని అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977, సవరణ చట్టం 2007 స్పష్టంగా చెబుతున్నాయి. అయితే చట్టాలకు వ్యతిరేకంగా ఆమంచి కృష్ణమోహన్ అక్కడ భూమి కొనడమే కాకుండా ఇల్లు కూడా నిర్మించారు. ఈ విషయాన్ని ఒంగోలులోని వెలుగొండ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ జె రాధాకృష్ణమూర్తి తన నివేదికలో పేర్కొన్నారు.

ఈ నివేదికను ఆయన అప్పటి జిల్లా కలెక్టర్ కు అందచేశారు. అయితే రాజకీయాలకు తలొగ్గిన అధికారులు అందిన ఫిర్యాదుపైగానీ, ప్రత్యేక కలెక్టర్ ఇచ్చిన రిపోర్టు పై గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామ పంచాయితీ అభివృద్ధి  లేఅవుట్  బిల్డింగ్ రూల్సునకు విరుద్ధంగా భవన నిర్మాణం జరిగినా కూడా అధికారులు పట్టించుకోలేదని విజిల్ బ్లోయర్ నాగార్జున రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

షెడ్యూల్డ్ కులాల వారిని బెదిరించి చట్ట వ్యతిరేకంగా స్థలం ఆక్రమించడమే కాకుండా ఇల్లు కూడా కట్టిన ఆ రాజకీయ నాయకుడిపై ఏ అధికారి కూడా చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదు.

ఏడాది గడచినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టులో కేసు విచారణ జరిగింది. WP15865/2021 కేసు విచారణ లో ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన హైకోర్టు  1.ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు వారికి 2. ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి(DPO),ఒంగోలు వారికి 3.రెవెన్యూ డివిజినల్ అధికారి(RDO), ఒంగోలు డివిజన్, ప్రకాశం జిల్లా వారికి 4. వేటపాలెం మండల తహశీల్దార్ వారికి 5. పందిళ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వారికి సదరు భూమి ఆక్రమణ దారుడు ఆమంచి కృష్ణ మోహన్ లకు నోటీసులు జారీ చేసి 3 వారాల గడువులోపల తగు వివరణ సమర్పించవలసినదిగా శనివారంనాడు ఆదేశించారు.

Related posts

ఒంగోలులో తెలంగాణ పోలీసులపై దౌర్జన్యం చేసిన వైసీపీ నేత

Satyam NEWS

ఆర్ 5 జోన్ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

Satyam NEWS

తయారీ రంగంలో జపాన్‌ ఆదర్శం… కేటీఆర్

Bhavani

Leave a Comment