39.2 C
Hyderabad
May 3, 2024 14: 56 PM
Slider నిజామాబాద్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీ

Paddy procurement centre

బిచ్కుంద మండలంలోని కథగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు భీంరావు బస్వంత్రావు పాటిల్, జూకల్ శాసనసభ్యులు హనుమంత్ షిండేతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ గ్రేడ్ కు రూ. 1835 బీ గ్రేడ్ కు రూ 1815 ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు.

అక్కడ పనిచేస్తున్న హమాలీ కార్మికులకు మాస్కులను అందజేసి ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్, సొసైటీ చైర్మన్ బాలాజీ, వైస్ చైర్మన్ యాదవరావు, సిఇఓ శ్రావణ్ కుమార్, సర్పంచ్ జీవన్ పాల్గొన్నారు.

ఇంకా మాజీ జడ్పీటీసీ సాయిరాం మా.జీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు సిద్ధిరాములు, ఎంపీటీసీ సాయిలు, మాజీ సర్పంచ్ హనుమాన్లు, తహశీల్దార్  వెంకట్రావు, ఎంపీడీవో ఆనంద్, వ్యవసాయ అధికారి పోచయ్య, మండల పరిషత్ అధికారి మహ్బూబ్, గ్రామ పరిధిలోని రైతులు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

కార్డన్ అండ్ సెర్చి: ప్రజల భద్రతకు నిర్బంధ తనిఖీలు

Satyam NEWS

ఫిర్యాదు దారులకు త్వరితగతిన న్యాయం

Sub Editor

సిజెఆర్ సమక్షంలో కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే బీరం వర్గీయులు

Satyam NEWS

Leave a Comment