39.2 C
Hyderabad
May 3, 2024 13: 12 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

#hujurnagar school

విద్యార్థులు అందరూ ఆన్లైన్ తరగతులు వీక్షించే విధంగా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బిక్షపతి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు టీ షాట్,డి డి యాదగిరిలో వచ్చే పాఠ్యాంశాలను విధిగా వీక్షించే విధంగా ఉపాధ్యాయులు చూడాలని, ఉపాధ్యాయులు టి1,టి2 ప్రొఫార్మాలను ప్రతి రోజు విధిగా నివేదించాలని, ప్రధానోపాధ్యాయులు హెచ్1,హెచ్2 ప్రొఫార్మాలను విధిగా నమోదు చేసి ఉపాధ్యాయులను మానిటరింగ్ చేయాలని తెలియజేశారు.

విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు,వర్క్ సీట్లను అందజేసి అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని అన్నారు. అనంతరం పాఠశాల లోని వివిధ రికార్డులు,రిజిస్టర్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మల్లెల ఉదయశ్రీ, ఉపాధ్యాయులు మాతంగి ప్రభాకరరావు,దీనారాణి,అశ్విని తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

Satyam NEWS

ఎంతో వైభవంగా చాదర్ఘాట్ రేణుక ఎల్లమ్మ కల్యాణం

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment