38.2 C
Hyderabad
April 28, 2024 19: 51 PM
Slider వరంగల్

వయోవృద్ధులకు ఉపయోగపడే న్యాయసహాయ పుస్తకావిష్కరణ

#anitareddy

A Ready Act Reference Book For Elders ( ఎ రెడి ఆక్ట్   రిఫరెన్స్ బుక్  ఫర్ ఎల్డర్ ) పుస్తకాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్  గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్  బెంచ్ మెంబర్  డాక్టర్ కె. అనితా రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల ట్రిబ్యునల్ పట్ల అందరికి అవగాహన ఉండాలని తెలిపారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే న్యాయ సహాయం కావాలంటే ట్రిబ్యునల్ బెంచ్ ని సంప్రదించాలని ఆయన కోరారు. చట్టాలను ఉపయోగించుకుని సీనియర్ సిటిజన్లు ఉపశమనం పొందాలని కలెక్టర్ తెలిపారు.

పెన్షన్లో ఇబ్బందులు పడుతున్నా,  పిల్లలతో లేదా ఇంకా ఏరకమైన ఇబ్బంది  ఎదురైనా దైర్యంగా ట్రిబ్యునల్ బెంచ్ ని వినియెగించుకొని సమస్య పరిష్కారించుకోవాలని  తెలిపారు.  అదే విధంగా ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించి ఆదరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో A. చంద్రమౌళి, V.దేవాచారి  పాల్గొన్నారు.

Related posts

చిరుత పులులు సంచ‌రించే ప్రాంతంలో సీఐ ప‌ర్య‌ట‌న‌….!

Satyam NEWS

విద్యార్థులకు మాస్కులను పంపిణీ చేసిన పాఠశాల ఉపాధ్యాయులు

Satyam NEWS

సిఐ జగదీష్ సస్పెండ్

Sub Editor

Leave a Comment