27.7 C
Hyderabad
May 14, 2024 03: 14 AM
Slider నల్గొండ

అమెరికా ప్రభుత్వ యంగ్ పొయెట్  రాయబారిగా సూర్యాపేట జిల్లా వాసి

#vidhatri

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన సామాన్య రైతు కీత నాగేశ్వరరావు కుమార్తె కీత విధాత్రికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.

చిన్న తనం నుండే కీత విధాత్రి ఎంతో కష్టపడి చదువుతూ అంచలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థాయికి చేరుకుంది. అమెరికా ప్రభుత్వం నిర్వహించిన యంగ్ పోయెట్ రాయబారి సెలక్షన్ లో పాల్గొన్న ఐదు లక్షల మంది విద్యార్థులలో విధాత్రి  టాప్ 5 గా నిలిచింది.దీనితో అమెరికా ప్రభుత్వం విధాత్రి ని యంగ్ పొయెట్ రాయబారిగా నియామకం చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా అమెరికా దేశ అధ్యక్ష భవనం వైట్ హౌజ్ నందు అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ విధాత్రి కి మెడల్ బహూకరించి అమెరికా ప్రభుత్వం నుండి 5,000 డాలర్లు పారితోషికం అందజేసి సత్కరించింది.

మన భారతీయ సంతతికి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండల విద్యార్థిని ఈ ఘనత సాధించడం పట్ల యావత్ దేశంతో పాటు స్వరాష్ట్ర ప్రజలు,సొంత జిల్లా,మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

హైకోర్టు తరలింపునకు వ్యతిరేకంగా అవనిగడ్డలో దీక్షలు

Satyam NEWS

ఫెయిల్యూర్:శాంతి భద్రతల సాధనలో ప్రభుత్వం విఫలం

Satyam NEWS

సోము వీర్రాజూ… ఏమిటీ ఈ అపరిపక్వ వ్యాఖ్యలు?

Satyam NEWS

Leave a Comment