29.7 C
Hyderabad
April 29, 2024 09: 36 AM
Slider నల్గొండ

పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

త్వరలో జరగనున్న సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతర పరిసరాలను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఈరోజు పరిశీలించారు.

జాతర పరిసరాలను, దేవాలయ ప్రదేశాన్ని, రోడ్డు మార్గాలను, భక్తులు వేచి ఉండే స్థలాలు వాహనాల పార్కింగ్ ప్రవేశాలు గ్రామాల నుండి జాతరకు వచ్చిపోయే అన్ని మార్గాల స్థితిగతులను ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగినదని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి జాతరను ప్రశాంతంగా నిర్వహిస్తామని, పెద్దగట్టు జాతర పోలీసు బందోబస్తు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. జాతీయ రహదారి వెంట వాహనాల ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఇతర శాఖల అధికారులతో కలిసి సమన్వయంగా పని చేయాలని ఎస్పీ గారు సిబ్బందికి తెలిపారు. జాతర ప్రాంగణంలో కావాల్సిన రక్షణ ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవాలని ఇతర శాఖలతో సమన్వయంతో ముందుకెళ్లాలని సిబ్బందికి సూచించారు.

ఎస్పీ వెంట DCRB DSP రవి, సూర్యాపేట రూరల్ సిఐ సోమనారాయణ సింగ్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ స్థానిక ఎస్సై 2 మధు, సిబ్బంది ఉన్నారు.

Related posts

ఆఫ్గనిస్తాన్ లో బాంబు పేలుళ్లు .. ముగ్గురు మృతి

Sub Editor

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ఖమ్మం కలెక్టర్

Satyam NEWS

తలసేమియా చిన్నారులకు రక్తం అందించిన జనచైతన్య ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment