27 C
Hyderabad
May 10, 2024 06: 39 AM
Slider అనంతపురం

వివాదాల స్వామి ప్రబోధానంద కన్నుమూత

#Swamy Prabhdhananda

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, త్రైత సిద్ధాంత కర్త, బహు గ్రంథకర్త స్వామి ప్రబోధానంద అనారోగ్యంతో మరణించారు. ఆశ్రమం నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు చనిపోయినట్లు ఆశ్రమవాసులు  తెలిపారు. జెసి దివాకర్ రెడ్డి కి ప్రబోధానంద కు తరచూ  గొడవలు జరుగుతూ ఉండేవి. ఆయన అసలు పేరు గుత్తా పెద్దన్న చౌదరి.

అనంతపురం జిల్లా,  తాడిపత్రి మండలం, చిన్నపొడమల గ్రామంలో ప్రబోధాశ్రమము, శ్రీకృష్ణమందిరము, ఇందూ జ్ఞాన వేదికను స్థాపించి తన రచనల్ని, ప్రసంగాలను ప్రచారం చేస్తూ వచ్చారు.మనుషులందరికీ భగవంతుడు ఒక్కడేనని, భగవద్గీత, బైబిల్,  ఖురాన్లలో వున్న దైవజ్ఞానం ఒక్కటేనని అయన రూపొందించిన త్రైత సిద్ధాంతం చెబుతుంది.

పలు అంశాలకు ఈ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తూ, తన ఆధ్యాత్మిక భావనలను వివరిస్తూ ప్రబోధానంద అనేక పుస్తకాలు రాశారు. పెద్దన్న చౌదరి అనే పూర్వనామం వదిలి ప్రబోధానందగా మారి త్రైత సిద్ధాంతాన్ని చెప్పడం 1978లో ప్రారంభమైంది.

ప్రబోధానంద శిష్యులు 1978తో క్రీస్తుశకం ముగిసి త్రైత శకం ప్రారంభమైందని ప్రతీ సంవత్సరాన్ని ఈ త్రైత శకం లెక్కల్లో చెప్పుకుంటూంటారు. ఆయన వయసు 70 సంవత్సరాలు.

Related posts

ఎస్.బి.ఐ. ఎదుట తెలంగాణ రైతు సంఘం ధర్నా

Satyam NEWS

హుజూర్ నగర్ పట్టణ ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

Satyam NEWS

ఇప్పుడు వాపోయి ఏం లాభం వేంకటరమణ దీక్షితులూ?

Bhavani

Leave a Comment