37.2 C
Hyderabad
April 26, 2024 20: 23 PM
Slider ఆధ్యాత్మికం

మౌన స్వామి 120 జయంతి ఉత్సవం..ప్రపంచమంతటా..!

#swamyramananda

మౌన స్వామి, బ్రహ్మ జ్ఞాని ,బ్రహ్మవేత్త..శ్రీశ్రీశ్రీ స్వామి రామానంద జయంతి ఉత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస స్వామి శ్రీశ్రీశ్రీ రామానంద యోగజ్ఞాన ఆశ్రమం స్వామీజీ జయంతి కార్యక్రమం జరిగింది. ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురూజీ నేతృత్వంలో ఆశ్రమంలో స్వామీజీ 120 వ జయంతి జరిగింది.

ఈ సందర్భంగా స్వామీజీ మహా సమాధి వద్ద..వారి సహస్ర నామావళితో శ్రీగురూజీ పూజ నిర్వహించారు.అనంతరం శ్రీగురూజీ.. శిష్యులనుద్దేశించి మాట్లాడారు.మరో వైపు అమెరికా లో ఉంటున్న శ్రీ గురూజీ శిష్యులు ఆశ్రమంలో స్వామీజీ జయంతి ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచానికి తెలియజేసారు.కేరళ రాష్ట్రం కళియేసిరిలో జన్మించిన స్వామీజీ పూర్వనామము కుంజికుట్టి నంబియిర్.అయిదేళ్ల ప్రాయంలో వైరాగ్య చింతన కలిగిన స్వామీజీ.. సర్వేయర్ ఉద్యోగం చేస్తూ..గురువు కోసం అన్వేషించే పనిలో పడి ఉద్యోగానికి రాజీనామా చేసారు.

నేరుగా ఇంటికి వెళ్లిన స్వామీజీ సిధ్ధవేదమనే మలళాయ గ్రంధాన్ని చదివి… ప్రాణాయామాన్ని అదే యోగాభ్యాసాన్ని ప్రారంభించారు.ఈ విద్యను గురుముఖత నేర్చుకోవాలన్న తలంపు తో బ్రహ్మర్షి సద్గురు శ్రీశ్రీశ్రీ శివానంద పరమ హంసల వారి వద్ద విద్య నేర్చుకున్నారు.నువ్వు చేస్తున్న  విద్యే యోగమని చెప్పడంతో.. శివానంద పరమహంస తన గురువు గా తలంచి..అక్కడ నుంచే కాలినడకన యావత్ దేశం  పర్యటించారు.

చివరిసారిగాతన  తల్లికి నమస్కరించి..తాను ఇల్లు విడిచి వెళ్లిపోతున్నాననంటూ తల్లికి నమస్కరించి…చిన్న కార్డుపై రాసి వెళ్లిపోయారు. అక్కడ నుంచీ.. కాలి నడకన…సంచరిస్తూ..ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, యేర్పేడు ,ధవళేశ్వరం.. చివరిగా విజయనగరం జిల్లా కామన్నవలస లో ఘోర తప్పస్సు చేసి అక్కడే ఆశ్రమం నెలకోల్పారని స్వామి శ్రీశ్రీశ్రీ రామానంద పీఠాధిపతి, శ్రీ గురూజీ రిటైర్డ్ డీఎంఅండ్ హెచ్ ఓ డా.వీ.వెంకటేశ్వరరావు తెలిపారు.

దాదాపు వందమంది కి పైగా హాజరైన ఈ జయంతి ఉత్సవంలో.. శిష్యులందరూ ఆశ్రమంలో జరిగిన అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ జయంతి ఉత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా శిష్యులందరూ హాజరయ్యారు.

Related posts

మహిళను బ్లాక్ మెయిల్ చేసిన వాడికి శిక్ష

Satyam NEWS

జగన్ ప్రభుత్వంపై వై ఎస్ సన్నిహితుల అసంతృప్తి

Satyam NEWS

ఆ క‌లెక్ట‌ర్‌కు మొక్క‌లంటే, ప‌చ్చ‌ద‌న‌మెంతో ఇష్టం!

Sub Editor

Leave a Comment