40.2 C
Hyderabad
May 2, 2024 18: 46 PM
Slider వరంగల్

స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేసిన విద్యార్ధులు

#muluguschools

తెలంగాణ గురుకుల సెట్-2021 లో ములుగు జిల్లా ములుగు మండలంలోని బరిగలపల్లి పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన 4 గురు విద్యార్థులు సీట్లు సాధించారు. ఇప్పటి వరకూ ఇంత పెద్ద ఎత్తున విద్యార్ధులు గురుకుల సెట్ లో ఎంపిక కాలేదు. ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ కాయిత రమేశ్ నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గరిగ లత నర్సింగరావు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్త పల్లి పోషన్న విద్యార్థులను అభినందించారు. స్థానిక సర్పంచ్ గరిగ లత మాట్లాడుతూ, గత సంవత్సరం ఒక విద్యార్థి కి సీటు రావడం, ఈ సంవత్సరం ఏకం గా 4 సీట్లు సీట్లు సాధించడం అభినందించదగ్గ విషయం అన్నారు.

ఈ నెల 1 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా కరోనా పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని వక్తలు కోరారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని తెలిపే స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్త పల్లి పోషన్న విద్యార్ధులతో చేయించారు. ఇంకా ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు పోరిక రమాదేవి, అంగన్వాడీ టీచర్ ప్రమీల గ్రామస్థులు కూడా పాల్గొన్నారు.

Related posts

విద్యా, వ్య‌వ‌సాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద‌పీట‌

Sub Editor

బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్ష

Bhavani

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు: కేసీఆర్

Bhavani

Leave a Comment