33.7 C
Hyderabad
April 29, 2024 01: 25 AM
Slider మెదక్

ఎప్రిసియేషన్: స్వచ్ఛ భారత్ లో టి హెచ్ ఆర్ సిద్దిపేట టీమ్

hareesh 1

బెంగళూరు లో జరుగుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ ఎక్సపోసర్  2020 లో సిద్దిపేట టీమ్ ద్వితీయ బహుమతి అందుకుంది. వేస్ట్ మేనేజ్‌మెంట్, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సేగ్రిగేషన్, ప్లాస్టిక్ ఫ్రీ టౌన్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు పలువురిని ఆకట్టుకున్నాయి.

స్వచ్ఛ ఆరోగ్య సిద్ధిపేట కోసం fssai ద్వారా హోటల్స్, రోడ్ సైడ్ ఫుడ్ యజమానులకు, కార్మికులకు శిక్షణ ఇచ్చిన అంశాలను సిద్దిపేట పట్టణ కౌన్సిలర్స్ ఇతర రాష్ట్రాల 10 మున్సిపాలిటీ ల ప్రతినిధుల ముందు తెలియచేశారు. స్వచ్ఛత ప్లాస్టిక్ రహిత సిద్దిపేట లో భాగంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి. హరీష్ రావు ప్రతిపాదించిన ఒక వినూత్న కార్యక్రమంపై వారు వివరించారు.

ప్లాస్టిక్ రహిత, పర్యావరణ సమతుల్యత ను కాపాడేందుకు మట్టి వినాయకులను ఏర్పాటు చేయడం, వన భోజనాలు, పండుగల సమయంలో కూడా స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాస్ లు ఉండే విధంగా చూడటం మంత్రి హరీష్ రావు చొరవతో జరిగిందని వారు వివరించారు. మంత్రి హరీశ్ రావు చొరవతో జరుగుతున్న వినూత్న కార్యక్రమాలను విన్న మిగతా మునిసిపాల్టీ ల ప్రతినిధులు ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేశారు.

తాము కూడా సిద్దిపేట ను సందర్శిస్తాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అత్తర్ పటేల్, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, బర్ల మల్లి ఖార్జున్,   కెమ్మసారం ప్రవీణ్, మోయీజ్, దీప్తి  నాగరాజు పాల్గొన్నారు. అదే విధంగా బహుమతి ప్రదానం కార్యక్రమం లో గ్యాదరి రవిందర్, చిప్ప ప్రభాకర్, బాసంగారి వెంకట్ లు కూడా పాల్గొన్నారు.

Related posts

‘ది వారియర్’ క్లైమాక్స్‌లో రామ్ తో ఫైట్ సూపర్

Satyam NEWS

బీసీ కుటుంబాలకు లక్ష ఆర్థిక సహాయం

Satyam NEWS

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగాధంలోకి నెట్టిన జగన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment