37.2 C
Hyderabad
May 6, 2024 20: 39 PM
Slider శ్రీకాకుళం

దాతృత్వం చాటుకున్న శ్యాంపిస్టన్స్ కార్మికులు

#SamcrugPistons

శ్రీకాకుళం జిల్లా  రణస్థలం మండలం వరిశాం వద్ద గల  శ్యాంక్రగ్ పిస్టన్స్ & రింగ్స్ ప్లాంట్-2 పరిశ్రమలో పనిచేస్తున్న వరిశాం గ్రామానికి చెందిన మడిచర్ల పైడిరాజు ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు.

దాంతో కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా తమ ఒక రోజు వేతనం అందచేశారు. మొత్తం అయిదు లక్షల రెండు వేల తొమ్మిది వందల రూపాయలను విరాళంగా వసూలు చేసి చనిపోయిన కార్మికుడి భార్య మడిచర్ల లక్ష్మికి అందజేశారు.

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్. అమ్మన్నాయుడు శ్యాంపిస్టన్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె భోగేష్, ఎస్.వి.రమణ,గొర్లె.కిరణ్,  సింక శివ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్. అమ్మన్నాయుడు మాట్లాడుతూ సిఐటియు సభ్యులు తమ హక్కుల కోసం పోరాటాలే కాకుండా తోటి కార్మికులను ఆదుకోవడంలో, సేవాకార్యక్రమాలలో ముందుంటారని అన్నారు. తోటి కార్మిక కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒకరోజు వేతనాన్ని ఇచ్చిన కార్మికులందరికీ అభినందనలు తెలియజేశారు.

Related posts

ఈ సారు ఇక్కడ అధికారి కాదు ఈ ప్రాంతానికి మహారాజు

Satyam NEWS

సీఎంపై అసభ్య పోస్టులు పెడితే ఆస్తులు అటాచ్ చేస్తాం

Satyam NEWS

రోడ్డుపై కత్తులతో స్వైర విహారంలో తమ్ముడు మృతి

Satyam NEWS

Leave a Comment