40.2 C
Hyderabad
April 29, 2024 17: 55 PM
Slider కృష్ణ

సీఎంపై అసభ్య పోస్టులు పెడితే ఆస్తులు అటాచ్ చేస్తాం

#sanjai

ఏపీ సీఎం జగన్ కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని సీఐడీ చీఫ్ సంజయ్‌ హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులపై ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెట్టామని చెప్పారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించామని.. నిందితుల ఆస్తులు కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపైనా కూడా చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొన్నింటిని గుర్తించి తొలగించామన్నారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు.

సీఎం జగన్, కుటుంబ సభ్యులపై పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ నేత కార్తీక్‌రెడ్డి, సమరసింహారెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అకౌంట్స్ గుర్తించామని పేర్కొన్నారు. విదేశాల నుంచి పెట్టే పోస్టుల విషయంలో ఎంబసీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. 202 సోషల్ మీడియా అకౌంట్స్‌ను మానిటరింగ్‌ చేస్తున్నామని వెల్లడించారు. 2 నెలల్లో కొత్తగా 31 కొత్త సోషల్ మీడియా అకౌంట్స్‌ గుర్తించామని, అసభ్య పోస్టులను షేర్, లైక్ చేస్తున్న వారిపై 2,972 సైబర్ బుల్లయింగ్ షీట్స్ ఓపెన్ చేసినట్లు సీఐడీ చీఫ్‌ సంజయ్‌ వెల్లడించారు.

Related posts

కేఏ పాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

Satyam NEWS

వక్ఫ్ ఆస్తుల జోలికి వస్తే సహించేది లేదు

Satyam NEWS

Buy Bitcoin Cash BCH with Credit & Debit Card, Bank Account or Apple Pay Online Instantly

Bhavani

Leave a Comment