40.2 C
Hyderabad
April 29, 2024 16: 36 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో జిల్లా కోర్టు కాంప్లెక్స్ కోసం స్థలం పరిశీలన

#WanaparthyCollector

వనపర్తి పట్టణంలో జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం మహబూబ్ నగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎస్. ప్రేమావతి నేడు స్థలాన్ని పరిశీలించారు. శనివారం వనపర్తి పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణ ప్రక్కన ఉన్న సర్వే నెంబర్ 200లో గల  ప్రభుత్వ భూమిని, మహబూబ్ నగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎస్. ప్రేమావతి,వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి పరిశీలించారు.

వనపర్తి జిల్లా కోర్టు భవనముల సముదాయము నిర్మాణానికి అనుకూలమైన 15 ఎకరాల భూమి వివరాలను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను అడగగా లొకేషన్ మ్యాప్ రూపములో ఆమెకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టుకు అనుకూలమైన స్థలముగా ఆమె నిర్ధారించారు.

ఈ సందర్భంగా  ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి వెంట  ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి పి. రఘురాం, 9వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బి. శ్రీనివాసులు, డి. ఎల్. ఎస్. ఏ. సెక్రటరీ ఎన్. వెంకట్ రామ్, జూనియర్ సివిల్ జడ్జి, వనపర్తి బి. ఇందిరా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మున్నూరు రవి, సెక్రటరీ మోహన్ కుమార్ యాదవ్, అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, ఎం.ఆర్.ఓ. రాజేందర్ గౌడ్,  న్యాయవాదులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

ఎన్నికల శిక్షణ పకడ్బందీగా చేపట్టాలి

Bhavani

అవసరమైన ప్రత్తి మిరప పంటలకు విత్తనాలు సిద్ధం చేయాలి

Satyam NEWS

సింహవాహిని

Satyam NEWS

Leave a Comment