32.2 C
Hyderabad
May 2, 2024 02: 29 AM
Slider వరంగల్

నిరుపేదల ఆకలిని పారదోలాలి: సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#taslima ahmmed

కరోనా విపత్తు పరిస్థితులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద ప్రజల ఆకలిని పారదోలాలని సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ వ్యవస్థాపకులు, ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.

సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు,నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ములుగు జిల్లా కేంద్రంతో పాటు ఇంచేర్ల, జంగాలపల్లి, ములుగు  గ్రామాలలో 60 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించి అప్రమత్తంగా ఉండాలని తస్లీమా అన్నారు.

మనోధైర్యంతో ఉంటే కరోనా వైరస్ దరిచేరదని తస్లీమా అన్నారు.

ఆమె వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు సభ్యులు మామిడి పెల్లి రమేష్, లావుడ్య సుక్రం,రాసమల్ల హేమంత్,అత్తని శ్రీకాంత్,బుర్ర రత్నాకర్, మార్త శ్రీనివాస్, ఇంజపెల్లి నవీన్,సొనవెని కుమార స్వామి, భానుప్రకాష్, భిక్షపతి, సురేష్,శ్రీను,నవీన్,రవి, రాజు తదితరులు ఉన్నారు.

Related posts

ఇంటి పరిసర ప్రదేశాలని శుభ్రంగా ఉంచుకోవాలి

Satyam NEWS

అఫిడవిట్లు దాఖలు చేయండి- హైకోర్టు

Satyam NEWS

Political turmoil: బ్రిటన్ ఆర్ధిక మంత్రిని తొలగించిన ప్రధాని ట్రస్

Satyam NEWS

Leave a Comment