30.2 C
Hyderabad
September 14, 2024 16: 32 PM
Slider తెలంగాణ

అఫిడవిట్లు దాఖలు చేయండి- హైకోర్టు

hicourt

టీఎస్సార్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేశారు. తెలంగాణలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద వాస్తవ పరిస్థితులపై ఈ నెల 10న నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్ కు, ఆర్టీసీ యాజమాన్యానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరాం. ప్రభుత్వ నిర్ణయం కోర్టుకు తెలిపాం. సమ్మెను ఇల్లిగల్ గా డిక్లేర్ చేయాలని కోర్టును కోరాం అని అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ తెలిపారు. సమ్మె వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపాం. ఆర్టీసీ నడిపించే బస్సుల కంటే వెయ్యి బస్సులు అదనంగా నడిపిస్తున్నామని కోర్టుకు తెలిపాం. కౌంటర్ దాఖలు చేయాలని, ప్రభుత్వానికి, ఆర్టీసీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతోపాటు 2 యూనియన్లకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 10 వ తేదీకి వాయిదా వేసింది అని ఆయన తెలిపారు

Related posts

సూర్యుడు ఉన్నంతకాలం హిందూ ధర్మం ఉంటుంది

Satyam NEWS

డిమాండ్ ఫర్ జస్టిస్: అమిత్ షా రాజీనామా చేయాలి

Satyam NEWS

14న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

Satyam NEWS

Leave a Comment