31.2 C
Hyderabad
May 3, 2024 02: 12 AM
Slider వరంగల్

అన్నదాత స్ఫూర్తి ప్రదాత

#taslima

రైతన్న లేనిదే బుక్కెడు బువ్వ కూడా లేదని,మనకు అన్నం పెట్టడం కోసం వాళ్ళ ఆకలిని మరిచిపోయి వ్యవసాయం చేస్తున్న అన్నదాతలు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలని ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. ఆదివారం సెలవు రోజున సబ్ రిజిస్ట్రార్ తస్లీమా యాసంగి వరి నాట్లు వేశారు. వెంకటాపూర్ మండలం (రామప్ప) పాలంపేట గ్రామంలో రౌతు శ్రీను – స్వప్న దంపతుల వ్యవసాయ పొలంలో కూలీలతో కలిసి నాటు వేశారు. మధ్యాహ్నం మహిళ కూలీలతో కలిసి అన్నం తిన్నారు. రోజంతా పని చేసినందుకు గాను 250 కూలీగా ఇచ్చారు. మానవాళికి వ్యవసాయమే జీవనాధారమని,వ్యవసాయాన్ని చేయడానికి రైతులు ఎండనక, వానానక వ్యవసాయ పనులు చేస్తూ మనకు అన్నం పెడుతున్నారని, రైతులు ఎక్కడికి వెళ్ళిన వారికి మర్యాద ఇవ్వాలని కోరారు.రైతులకు మీము ఉన్నామనే భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తస్లీమా అన్నారు. అంత పెద్ద ఆఫిసర్ మేడమ్ మాతో  కలిసి రోజంతా పని చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని మహిళ కూలీలు సంతోషం వెలిబుచ్చారు.

Related posts

ఇది జగనన్న గోరుముద్దనా లేక పురుగులు ముద్దనా…..???

Satyam NEWS

ఎన్ డి ఏ లో చేరేందుకు ప్రాధేయపడుతున్న జగన్

Satyam NEWS

సమష్టి కృష్టితో కరోనాను ఎదుర్కొందాం

Satyam NEWS

Leave a Comment