39.2 C
Hyderabad
May 3, 2024 12: 59 PM
Slider కడప

ఇది జగనన్న గోరుముద్దనా లేక పురుగులు ముద్దనా…..???

#jaganannagorumudda

రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జగనన్న గోరుముద్ద పేరుతో ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు కడుపునిండా ఆహారం అందాలి అనే ఆలోచనతో ప్రారంభించిన పథకం అది విద్యార్థులకు సరైన పద్ధతిలో అందలేదని ఏఐఎస్ఎఫ్ కడప జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల లవకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా చిన్నమండెం మండలం దిగువ గొట్టి వీడు గ్రామం ముండ్లవారిపల్లి అంగన్ వాడి పాఠశాలలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద ఇచ్చే చిక్కి లలో పురుగులు పట్టి ఉన్న చిక్కులను అంద చేశారన్నారు. ఇలా పురుగులు పట్టిన చిక్కీలు ప్రభుత్వం సప్లై చేయడం ద్వారా విద్యార్థులకు ఏ విధంగా గా పోషకాలు లభిస్తాయి అన్నారు. విద్యార్థినీ విద్యార్థులకి కడుపుకు తినడానికి సరిపోయే సక్రమంగా ఉండే సరుకులు సప్లై చేసి  విద్యార్థినీ విద్యార్థుల కు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చేశారు.

Related posts

స్థానిక సమస్య లపై బస్తీ బాట కార్యక్రమం

Satyam NEWS

పెట్రేగి పోతున్న మైనింగ్ మాఫియా

Satyam NEWS

ఆశ్రమ పాఠశాలల మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి

Satyam NEWS

Leave a Comment