ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన చేపట్టారు. మిర్చి ధర ఒకే రోజులో దారుణంగా పడిపోవడంతో వారు ఆందోళనకు దిగి మార్కెట్ గేటు మూసివేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్నరూ. 18 వేలు పలికిన మద్దతు ధర నేడు 13వేలకు పడిపోయింది. మార్కెట్ యార్డు ఆఫ్ సెట్ ధరనే వెయ్యి రూపాయలు తగ్గించి రూ.17 వేలుగా పెట్టారు. దాంతో ఒక్క సారిగా ధర మొత్తం పడిపోయింది.
ఒక్క రోజులో తెల్లారేసరికి రూ.5వేలు తగ్గిన మిర్చిధర తో రైతులు తీవ్రంగా ఆందోళన చెందారు. మిర్చి ధర ఒకేసారి రూ. 5000 తగ్గించడం వల్ల రైతులు మార్కెట్ గేటు మూసివేసి మరీ ఆందోళనకు దిగారు. మార్కెట్ ఛైర్మన్‌ను చుట్టుముట్టి ధర పెంచాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డు చైర్మన్ ను కూడా రైతులు అడ్డుకోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతులను ఆపి ఛైర్మన్‌ను కార్యాలయానికి సురక్షితంగా తరలించారు.