38.2 C
Hyderabad
April 27, 2024 18: 38 PM
Slider కడప

పక్కా గృహాల నిర్మాణంపై ప్రభుత్వ విధానం పై బత్యాల ఫైర్

#Batyala

కడప జిల్లా రాజపేట పట్టణంలోని టిడిపి కార్యాలయంలో గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు పక్కా గృహాలు కట్టిస్తామని వైకాపా ప్రభుత్వం నమ్మబలికి నేడు ప్రభుత్వ విధానాన్ని మార్చుకోవటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో వైకాపా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పేదల గృహాల పట్ల ప్రభుత్వం ప్రకటించిన మొత్తం సరిపోదని వాదించారని నేడు వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ మొత్తాన్ని కుదించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో రూరల్ లో రెండు లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయిస్తే ,నేడు లక్షా ఎనభై వేల రూపాయలు ఈ ప్రభుత్వం కేటాయించిందన్నారు.

అప్పటికీ ఇప్పటికీ గృహ నిర్మాణాల్లో పెరిగిన ధరల కారణంగా గృహ నిర్మాణాలు వినియో గదారులు చేపట్టలేరని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం 30 లక్షల గృహాలు పేద ప్రజలు కట్టిస్తామని మాట చెప్పిందని కానీ సంవత్సరానికి 50 వేల గృహాలు కట్టిస్తామని అని చెబుతోందన్నారు.

ఈ విధంగా అయితే 15 సంవత్సరాలు పూర్తయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టలేరని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో టీడీపీ నేతలు డాక్టర్ సుధాకర్,అనసూయమ్మ, భారతాల శ్రీధర్ బాబు యాదవ్,మందా శ్రీనివాసులు,మందపల్లె శ్రీనివాసులు, సంజీవ రాయుడు,బషీర్,పాండు రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒకే ఒక్కడు

Satyam NEWS

టీడీపీ ఎన్నికల బహిష్కరణ సరైందని కోర్టు తీర్పుతో రుజువైంది

Satyam NEWS

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

Leave a Comment