30.3 C
Hyderabad
March 15, 2025 09: 37 AM
Slider హైదరాబాద్

పేదలకు నిత్యావసరాలు పంచిన టీడీపి నాయకుడు

#Builder Prakash

కరోనా దెబ్బతో విధించిన లాక్ డౌన్ వల్ల ఏ రోజుకారోజు పని చేసుకుని జీవిస్తున్న నిరు పేదల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేదలకు అంబర్ పేట  నియోజకవర్గం  టిడిపి పార్టీ సీనియర్ నాయకుడు బిల్డర్ ప్రవీణ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

నల్లకుంట పరిధిలోని ఫీవర్ హాస్పిటల్ వద్ద 400 పేద కుటుంబాలకు, జిహెచ్ఎంసి కార్మికులకు ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిల్డర్ ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశంలోనే అత్యధిక మిగులు బడ్జెట్ తో సంపన్న రాష్ట్రంగా వెలిగిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ప్రజలు అన్నమో రామచంద్ర అనే స్థితికి తీసుకు వచ్చిన కెసిఆర్ ప్రభుత్వానికి జోహార్లు అని అన్నారు.

కేసీఆర్ పంపించే బియ్యం ప్రజలు ఎవరు తినడం లేదని ఆయన అన్నారు. తినడానికి పనికి రాని స్థితిలో పురుగులు పట్టి ఉన్నా బియ్యాన్ని పంపుతున్నారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా క్షేత్ర స్థాయిలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు.

Related posts

క్రాష్:ఎంపీలో ఫుట్ ఓవర్‌ వంతెన కూలి 6గురికి గాయాలు

Satyam NEWS

సినిమా రివ్యూ: ఆకట్టుకున్న యండమూరి వీరేంద్రనాధ్ అతడు ఆమె ప్రియుడు

Satyam NEWS

జమ్మూ కాశ్మీర్ జనాభా పై మొత్తుకుంటున్న పాకిస్తాన్

Satyam NEWS

Leave a Comment