42.2 C
Hyderabad
April 26, 2024 16: 09 PM
Slider నిజామాబాద్

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణ

#Kamareddy Court

హత్య కేసులో జైలులో ఉన్న వ్యక్తికి బెయిల్ మంజూరు కోసం బుధవారం కామారెడ్డి అదనపు జిల్లా జడ్జి బి. సత్తయ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. కామారెడ్డి పట్టణంలో గత నెల 22 జరిగిన గొడవలో ఒకరిని హత్యా యత్నం కేసు కింద పోలీసులు జైలుకు పంపారు. 

దీనికి సంబంధించి ముద్దాయి బంధువులు న్యాయవాది ద్వారా అదనపు జిల్లా జడ్జి సత్తయ్యను  ఇమెయిల్ ద్వారా  ఆశ్రయించారు.  దాంతో న్యాయమూర్తి  అత్యవసర కేసు కింద పరిగణించి లాక్ డౌన్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు.

విచారణలో ప్రాసిక్యూటర్ అమృత్ రావ్, ముద్దాయి తరపు న్యాయవాది మక్సూద్ అహమద్, కోర్టు క్లర్క్  పాల్గొన్నారు. కేసుకు సంబంధించిన పత్రాలను కూడా మెయిల్ ద్వారా పంపారు.

Related posts

కడప జిల్లాలో పురివిప్పిన ఫ్యాక్షన్: టీడీపీ నేత దారుణ హత్య

Satyam NEWS

కొత్త రికార్డు దాటిన మెట్రో రైల్ కలెక్షన్లు

Satyam NEWS

గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Satyam NEWS

Leave a Comment