32.2 C
Hyderabad
May 9, 2024 14: 31 PM
Slider ముఖ్యంశాలు

పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా

#tdp

గుంటూరు జిల్లా నకరికల్లు మండల కేంద్రంలో కరెంటు చార్జీల పెంపుకు నిరసనగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు,మాజీ ఎం.పి.పి నాగౌతు శౌరయ్య ఆధ్వర్యంలో జంక్షన్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శౌరయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఇష్టానుసారంగా కరెంటు చార్జీలను పెంచిందని దీనివలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

కరోనా విపత్తు వలన ప్రజలు చాలీ, చాలని ఆదాయంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, అంతేగాక పెరిగిన పెట్రోల్ ,గ్యాస్ ధరలు,ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, కరెంటు చార్జీలు కూడా పెరగడంతో వారి పరిస్థితి మరీ దారుణంగా తయారయిందని అన్నారు.

కనుక పెంచిన కరెంటు చార్జీలు తగ్గించి ప్రజలను ఆదుకోవాలని కోరారు. అనంతరం కరెంటు బిల్లులను దగ్ధం చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పి.పి.సాగి కోటేశ్వరరావు, షేక్ అలీబాషా,గ్రామ పార్టీ అధ్యక్షుడు టి.వెంకట్రావు, సంగుల అప్పారావు, రావెళ్ళ గోపి,ఢీకొండ మహానంది,షేక్ బండ్ల జాను,ఆకుల వెంకటేశ్వర్లు, వెంకయ్య,గురువులు,శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్వాతంత్య్రం కోల్పోయిన అఫ్ఘానిస్థాన్ ప్రజలు

Satyam NEWS

కొల్లాపూర్ లో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

Satyam NEWS

ఘనంగా దత్త జయంతి వేడుకలు

Bhavani

Leave a Comment