32.2 C
Hyderabad
May 9, 2024 21: 15 PM
Slider అనంతపురం

రాజంపేటలో టీడీపీ జెండా ఎగరేస్తా…

#batyala

టీడీపీ లోఉన్న వైసిపి కోవర్టులు భరతం పట్టి, వారి బంగా రం బయటపెట్టి, వైసీపీ కుట్రలను కుతం త్రాల ను రాజంపేట నియో జకవ ర్గంలో తెలుగుదేశం జెం డా ఎగరేస్తామని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ భత్యాల చెంగల రాయుడు తెలియజేశారు. బుధ వారం రాత్రి అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని బోయినపల్లిలో టీడీపీ నేత అద్దెపల్లె ప్రతాప్ రాజు ఆధ్వర్యంలో జరిగిన భవిష్యత్తు గ్యారంటీ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ తన కోవర్ట్ లను టిడిపి లోకి పంపి గెలవాలని చూస్తుందని, అందుకే టిడిపిలో ఉన్న కొందరు పార్టీ చేపట్టిన కార్యక్రమాలను చేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టిడిపి విజయాన్ని ఆపలే రని, రాజంపేటలో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు.

రాబోయేది తెలుగుదేశం పార్టీ అని ఆంధ్ర ప్రజల భవిష్యత్తు గ్యారంటీ టిడిపితోనే అని, చంద్రన్న పాలనలోనే సంక్షేమం అభివృద్ధి రాష్ట్రానికి ఎంతో అవసరమని, తెలుగుదేశం ప్రవేశపెట్టబోతున్న ఆడ బిడ్డనిది, తల్లికి వందనం, దీపం, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నదా తకు ఆర్థిక సాయం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి మంచినీరు, పూర్ టు రిచ్ కార్యక్రమం, రాష్ట్రంలోని నిరుద్యోగి కి యువ గళం నిధి కింద 3000 రూపాయల బృతి, ఉద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, అలాగే గతంలో మాదిరిగానే పేదలకు అందుబాటులో ఇసుక, నిత్యావసర వస్తువులు అందిస్తామని తెలియజేశారు.

ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి లేక అప్పులతో సతమతం అవుతుందని, అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ కావాలంటే టిడిపికి ఓటు వెయ్యాలని ఆయన కోరారు. రాజంపేట తెలుగుదేశం కోట అని కొందరి నాయకుల స్వార్థానికి ఇక్కడ ఓటమిలు ఎదురయ్యాయని, ఈసారి మాత్రం టిడిపి జెండా ఎగరేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు జి ఎన్ నాయుడు, మాజీ కౌన్సిల్ ఛైర్మెన్ షరీఫ్, టిడిపి రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్, డా. సుధాకర్, గన్నే సబ్బనరసయ్య నాయుడు,ఇడిమడకల కుమార్,అనసూయమ్మ, జ్యోతి, లక్ష్మీ నారాయణ, అబుబకర్, మందా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మత్స్య సంఘం మద్దతు

Satyam NEWS

18న థియేటర్స్ లో అర్జీవి కుటుంబ కథా చిత్రం మర్డర్ !

Satyam NEWS

వితంతు పింఛన్ల ఐడి కార్డుల పంపిణి

Bhavani

Leave a Comment