28.2 C
Hyderabad
May 9, 2024 02: 11 AM
Slider మెదక్

రైతులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్!

#CM KCR

కేసీఆర్ ప్రభుత్వం మాటలే తప్ప 24 గంటల కరెంటు రైతాంగానికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎల్.సూర్యవర్మ అన్నారు. మంగళవారం రోజు సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ లోని విద్యుత్ సబ్స్ స్టేషన్ ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలసి సందర్శించిన సందర్భంగా సూర్యవర్మ మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటినుండి అబద్ధపు మాటలతో రైతుల మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు.

కేసీఆర్ కు దమ్ముంట్టే 24 గంటల కరెంటు ఎక్కడిచ్చారో నిరూపించాలని డిమాండ్ చేశారు.ప్రతి ఏటా రైతులు తీసుకున్న పంట ఋణానికి ప్రభుత్వం నుండి మిత్తి ఇవ్వాల్సి ఉండగా మిత్తికి ఎగనామం పెట్టి రైతు బంధు ఇస్తున్నాడని దానితో బడబాబులకు మేలు జరుగుతుంది తప్ప సన్న చిన్న కారు రైతులకు ఎలాంటి లాభం లేదని అన్నారు.

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ పది సంవత్సరాలు గడిచిన రుణమాఫీ చేయలేదని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చేతుల్లో బిఆర్ఎస్ ఒడిపోతుందని గ్రహించే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి రోడ్లమీడికి వచ్చి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బొమ్మలు కాలబెడుతున్నారని అన్నారు.

మీరు నిజంగా 24 గంటల కరెంటు ఇస్తే లాగ్ బుక్కులు దాసిపెట్టాల్సిన అవసరం ఏముందని అన్నారు పెద్దకోడూర్ సబ్స్ స్టేషన్ లో చూస్తే 24 గంటల కరెంటు ఉవ్వడంలేదని తేటతెల్లం ఐనదని అన్నారు. తరువాత సబ్స్ స్టేషన్ ముందు మండల అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, ఐ.ఎన్.టీ.యు.సి జిల్లా అధ్యక్షుడు సుంచు రమేష్, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి సామల సంతోష్, ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు బంక చిరంజీవి, ఎస్.సి సెల్ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి కనకరాజు, సోషల్ మీడియా జిల్లా కోఆర్డీ నేటర్ అజ్జు యాదవ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బోయ ఎలం, వెంకట్ రెడ్డి, అంతగిరి చంద్రశేఖర్, గొడుగు దిలీప్, సదుగురు, శ్రీనివాస్, బోయ వెంకట్, శ్రీనివాస్, సీతాబాలు, మున్న, హర్షద్, సందీప్, కుమార్, జావిద్, తదితరులు ఉన్నారు.

Related posts

వనపర్తి అనూస్ అకాడమీ హై స్కూల్  విద్యార్థుల ప్రతిభ

Satyam NEWS

అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో భీష్మ ఏకాదశి

Satyam NEWS

ఆళ్లగడ్డ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Satyam NEWS

Leave a Comment