32.2 C
Hyderabad
May 2, 2024 00: 01 AM
Slider అనంతపురం

వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన జగన్ రెడ్డి

#chandrababu

ఉమ్మడి అనంతపురం రైతాంగం ఎక్కువగా ఆధారపడే పంట వేరుశనగే. ఆ పంటకు గిట్టుబాటుధర ఉంటేనే ఇక్కడి రైతులు నిలదొక్కుకోగలరు. నాలుగేళ్లుగా ఈ ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. టీడీపీ ప్రభుత్వంలో అనంతపురం జిల్లాను ప్రత్యేకంగా తీసుకొని, వేరుశనగ పంట కు ఇన్ పుట్ సబ్సిడీ అందించాం. పంటనష్టం వచ్చినప్పుడు పరిహారం కింద ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి వేరుశనగ రైతుల్ని ఆదుకున్నాం. ఒక సంవ త్సరంలో ఇన్ పుట్ సబ్సిడీతో పాటు, పంటలబీమా సాయం కూడా అందించాం అని చెప్పారు చంద్రబాబునాయుడు.

ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పల్లెపల్లి గ్రామంలో వేరుశనగ రైతులతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. రాయదుర్గంలో మరీ ఇబ్బం దిగా ఉంటుంది. ఈ ప్రాంతం ఎడారి అవ్వకుండా టీడీపీహాయాంలో అనేక చర్యలు తీసుకున్నాం.

మొట్టమొదటిసారి భైరవాని తిప్ప ప్రాజెక్ట్ నిర్మాణా నికి శ్రీకారం చుట్టాం. రూ.970కోట్లు ఖర్చవుతుందంటే, అందుకు సరిపడా నిధులు కేటాయించి, 18 కిలోమీటర్ల మేర కాలువలు కూడా తవ్వడం జరిగింది. టీడీపీప్రభుత్వం వచ్చి ఉంటే 2020 నాటికి ప్రాజెక్ట్ పూర్తయ్యేది అని ఆయన అన్నారు. దుర్మార్గపు ప్రభుత్వం రావడంతో ప్రాజెక్ట్ మొత్తం ఎత్తిపోయింది. ఈ జిల్లాకు హంద్రీనీవాతో నీళ్లు వచ్చాయి.

ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే, నేను వచ్చాక దాన్ని పూర్తిచేశాను. అలానే  మారాల, జీడిపల్లి, చెర్లోపల్లి, గొల్లప ల్లి రిజర్వాయర్లు నిర్మించింది టీడీపీ హాయాంలోనే. ఇక్కడ నీటి వసతి తక్కువనే బిందుసేద్యం, తుంపరసేద్యంతో సాగు చేప ట్టేలా చేశాను. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించడానికి ఆ విధానమే సరైంది. బిందుసేద్యం, తుంపరసేద్యంపై 90శాతం సబ్సిడీ అందించాం. రైతులు ఎక్కువగా దానిపై ఆధారపడి వ్యవసాయం చేసేలా చేశాం. అలాం టి పద్ధతుల్ని కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది అని ఆయన అన్నారు.

చంద్రబాబు ఎదుట రైతులు వెల్లడించిన అభిప్రాయాలు

విత్తనాలు, ఎరువులు, మందులు  కొనే పరిస్థితి లేదని, అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయని, వాటిలో కూడా కల్తీలు ఎక్కువయ్యాయని, పంట నష్టానికి పరిహారంగా ప్రభుత్వం నుంచి పంటలబీమా కూడా అందడం లేదని, సరైన ధర లభించడంలేదని చంద్రబాబుతో రైతులు మొరపెట్టుకున్నారు. టీడీపీ హాయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు అందేవని ఇప్పుడు 7శాతం వడ్డీ వేస్తున్నారని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ విధానం మరలా అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబుని కోరారు.

జగన్ రెడ్డి వచ్చినప్పటి నుంచీ విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారని రాయదుర్గంలో ఎండలు అధికమని, అందుకు తగిన ట్టుగా నీటివసతి లేదని మొరపెట్టుకున్న కర్షకులు. 18ఏళ్లుగా సరైన పంట లు వేయక, వేసిన పంటలకు గిట్టుబాటుధర లేక, అప్పులు పెరగడంతో ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని చంద్రబాబు ఎదుట కన్నీటి పర్యంతమైన రైతులు. టీడీపీప్రభుత్వం రాగానే రైతులకు అండగా నిలిచి, తమ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబుని కోరిన రైతులు.

Related posts

ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవిస్తున్నామంటే ఆనాటి సమరయోధుల త్యాగ  ఫలితమే

Satyam NEWS

త్రికూటాద్రి లో మార్మోగుతున్న”ఓం నమః శివాయ”మంత్రం

Satyam NEWS

బీజేపీకి షాక్ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

Satyam NEWS

Leave a Comment