38.2 C
Hyderabad
May 2, 2024 22: 08 PM
Slider హైదరాబాద్

ఘనంగా అల్వాల్ లయోలా అకాడమీ  టెక్నోవగాంజా 2023

#layola

సికింద్రాబాద్ అల్వాల్ లోని లయోలా అకాడమీ  బిఎస్సి  కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజినీరింగ్ విభాగం ఈ రోజు టెక్నోవగాంజా 2023 ఘనంగా నిర్వహించింది.  బిఎస్సి కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజినీరింగ్ విభాగ అధిపతి కె అనిత మాట్లాడుతూ  ఈ విభాగం స్థాపించి 35 సంవత్సరాలు అయిన సందర్భంగా గత వారం రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

విద్యార్థుల కోసం క్విజ్ పోటీలు, బ్రేక్ ది క్వరి , డిబేట్ పోటీలు, పజిల్ గేమ్స్ నిర్వహించమని చెప్పారు. ఈ రోజు ముగింపు కార్యక్రమానికి సిబిఐటి కళాశాల అధ్యాపకుడు, పిఆర్ఓ డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. డాక్టర్ ప్రసాద్ మాట్లడుతూ బ్లాక్ చైన్ టెక్నాలజీ, దాని ఉద్యోగ అవకాశాలు గురించి వివరించారు. క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ అంటే ఏమిటో విద్యార్థులకు వివరంగా వివరించారు.

లయోలా అకాడమీ ప్రిన్సిపాల్  రేవ్ ఆఫ్ఆర్  డాక్టర్ జోజి రెడ్డి ఎస్ జ్ మాట్లాడుతూ లొయోల పూర్వ విద్యార్థులు ఎన్నో రంగాలలో బాగా స్థిరపడ్డారని చెప్పారు. అంతే కాకుండా వారు దేశానికి కూడా సేవ చేస్తున్నారని తెలిపారు.  వైస్ ప్రిన్సిపాల్ (పిజి)  రేవ్ ఆఫ్ఆర్  డాక్టర్ ఎమ్ జోసెఫ్ కుమార్ ఉద్యోగాలు పొందడానికి అవసరమైన నైపుణ్యాల పాత్ర చెప్పారు. 

ఎస్ జ్ వైస్ ప్రిన్సిపాల్ (యుజి)  రేవ్ ఆఫ్ఆర్  అరుళ్ జోతి ఎస్ జ్ లయోలా అకాడమీ అనుసరించే బోధనా విధానం ప్రపంచ ప్రమాణాల పాటిస్తున్నాయి అన్నారు.  విద్యార్థుల నిర్వహించిన వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బిఎస్సి విభాగ ఇతర ఆధ్యాపకులు ఎస్ లక్ష్మి, ఎస్ స్వప్న, కె హిమ బిందు, రామన్ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నర్సింగ్ ఆఫీసర్స్

Satyam NEWS

కార్తీకమాసం కైవల్యపథం!

Sub Editor

అమరుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్ర్యం

Satyam NEWS

Leave a Comment