38.2 C
Hyderabad
May 2, 2024 19: 12 PM
Slider ప్రత్యేకం

అరాచక పాలనకు పరాకాష్ఠ

#raghurama

రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న పాలన కంటే మహమ్మద్ బిన్  తుగ్లక్ పాలన ఎంతో నయమని నరసాపురం ఎంపీ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. రాచరికం లోనూ ఇంతటి అద్వాన పాలన చూడలేదని ఆయన అన్నారు. హిట్లర్ సైతం ఒక వర్గంపై ఇంతటి అరాచకాన్ని చేసి పేర్కొన్నారు. అనపర్తి, గన్నవరం సంఘటనలు చూస్తే సమాజంలో ఉన్నామా?, అని సిగ్గు అనిపించడం లేదా ?? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఉందా?, ఏమిటి ఈ ధమనకాండ?? అని ప్రశ్నించారు. కళ్ళ ఎదురుగానే కొట్టి,  తగులబెట్టి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీసు  స్టేషన్ కు  వెళ్లిన టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు.

హత్యాయత్నం కేసుతోపాటు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడానికి పోలీసు అధికారులను అడ్డం పెట్టుకోవడం దారుణమన్నారు. పోలీసు అధికారుల నేమ్ ప్లేట్ పై కులం రాసి ఉంటుందా అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

కట్టుకథలు చెబుతున్న పోలీసులు

ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడానికి, పోలీసు అధికారులు కట్టుకథలు అల్లుతారని ఆయన తెలిపారు. జాషువా,  పాల్, సురేందర్ రెడ్డి తో పాటు మరో రెడ్డి అధికారి ఇతర కేసులు నమోదు చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. కనుక రావు అనే అధికారిని ఎవరు కొట్టారని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, వైసిపి కార్యకర్తలు,  నాయకులు కొట్టారా?, పట్టాభి దాడి చేశారా అని నిలదీశారు.

పట్టాభి పై హత్యాయత్నం కేసు నమోదు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా?  అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామము ప్రస్తుత పాలకుల నేతృత్వంలో పులివెందుల మాదిరిగానే ప్రతి  తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వారిపైనే కేసులు నమోదు చేయడం గతంలోనూ జరిగిందని గుర్తు చేశారు.

ఇళ్ల స్థలాల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన లబ్ధిదారులపైనే తిరిగి కేసులు నమోదు చేసి, లాకప్లో చిత్రహింసలకు గురి చేశారన్నారు. రాష్ట్రంలో పోలీసులు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వం ఉన్నది దేనికని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి అని నిలదీశారు. ఇంతటి అద్వాన ప్రభుత్వం భూమి పుట్టిన తర్వాత చూసి ఉండరని అన్నారు.

రాక్షస పాలన గురించి పుస్తకాల్లో చదివాం కానీ ఇప్పుడు చూస్తున్నాం

ఎంతోమంది అరాచక పాలకుల గురించి, రాక్షసుల గురించి పుస్తకాల్లో చదివామని, కానీ ఇంతటి అరాచక పాలన ఉంటుందా అని ప్రతి ఒక్కరూ అనుకొని ఉంటారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమందిని చూస్తుంటే వారే నయం అనిపిస్తుందని రఘు రామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. ప్రజలకు దిక్కులేని రక్షణ లేని వ్యవస్థలో బతుకుతున్నామని అంటే బాధనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

గన్నవరంలో పాలక పక్షం వారే దాడులు చేసి, వాహనాలను ధ్వంసం చేసి ప్లెక్సీలను కోసివేస్తే, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే  గన్నవరం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్న పట్టాభి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే, ఆయన్ని రెక్కలు విరిచి కట్టి పోలీసులు తీసుకువెళ్లడం దారుణమన్నారు.  గతంలో తనని లాకప్ లో  ఎలా చిత్రహింసలకు గురి చేశారో, ప్రస్తుతం పట్టాభిని కూడా చిత్రహింసల పాలు చేసే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారిని గతంలో మాదిరిగా లాఠీలతో కొట్టకుండా, కరెంట్ షాక్ లు ఇస్తున్నట్లు తెలుస్తోందన్నారు. పట్టాభిని కొట్టారా?, లేకపోతే కరెంటు షాక్ ఇచ్చి  వేధించారా అన్నది తెలియాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ లేదని, ప్రభుత్వ వైద్యులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. పట్టాభిని ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో, ఊహించుకుంటేనే ఆందోళనగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టాభిని అరెస్టు చేసినప్పటికీ, ఆయన్ని ఇంతవరకు కోర్టులో ప్రవేశపెట్టకపోవడం పోలీసుల వ్యవహార శైలి ఏమిటో స్పష్టం అవుతుందన్నారు. తన భర్త ఆచూకీ తెలియడం లేదని పట్టాభి సతీమణి డీజీపీ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలియజేయడానికి ప్రయత్నించగా ఆమెను గృహనిర్బంధం చేయడం పరిశీలిస్తే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అనే  అనుమానాలు కలుగుతున్నాయన్నారు..

గవర్నర్ కు ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేయాలి

గన్నవరం ఘటనపై రాష్ట్ర నూతన గవర్నర్ నిష్పక్షపాతమైన విచారణ జరిపించి దోషులను శిక్షించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. గవర్నర్ గా  పదవీ బాధ్యతలను స్వీకరించడానికి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగనున్న అబ్దుల్ నజీర్ కు రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ, ఫిర్యాదు చేయాలని కోరారు. ఒకవేళ ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయడానికి భయపడితే, లేఖల ద్వారా తమ ఫిర్యాదును అందజేయాలన్నారు.

గన్నవరం ఘటనపై తాను కూడా గవర్నర్ కు  లేఖ రాయనున్నట్లు, అవకాశం లభిస్తే గవర్నర్ కు గన్నవరం ఘటనపై సమగ్ర వివరాలను అందజేస్తానని తెలిపారు. పట్టాభిని ఇప్పటివరకు న్యాయస్థానంలో ప్రవేశపెట్టకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన రఘురామకృష్ణంరాజు, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నిన్న తనని చిత్రహింసలకు గురి చేశారని, నేడు పట్టాభి ని అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేసి ఉంటారన్న ఆయన, రేపు మరొకరి వంతని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణం ఆసన్నమైందని, లేకపోతే రేపు ప్రజలకు కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. గవర్నర్ ను కలిసి కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి, ఐపీసీ 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయలేరు కదా  అన్నారు.

పోలీసులపై నమ్మకం లేదని, న్యాయ వ్యవస్థ పైనే నమ్మకం ఉందన్నారు. న్యాయస్థానంలో ప్రతి ఒక్కరికి న్యాయమే జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు కూడా నమ్మకాన్ని కాపాడుకునేందుకు చెత్త కేసులు నమోదు చేసిన వారిపై, ఎదురు కేసులను పెట్టాలని కోరారు.

జగన్ కు  కోపం వస్తే కౌన్సిల్ రద్దా?

గతంలో శాసనమండలి శుద్ధ దండుగా అని పేర్కొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడదే శాసనమండలి లో ఎస్సీ, ఎస్టీ,  బీసీ,  మైనార్టీలకు పదవులను కల్పించి తానేదో సామాజిక న్యాయాన్ని పాటించినట్లు చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

గతంలో శాసనమండలి నిర్వహణకు 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వృధా అని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్ లకిస్తున్న జీతభత్యాలు ఎక్కువన్నారు . గతంలో శాసనమండలిని రద్దు చేయాలని  జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయగా, ఆ తర్వాత తమ పార్టీ జాతీయ కార్యదర్శి కనిపించిన వారి కాళ్లు పట్టుకొని శాసనమండలిని రద్దు చేయకుండా ప్రాధేయపడ్డారన్నారు.

సామాజిక న్యాయాన్ని పాటించిన అభినవ పూలే, అంబేద్కర్ అంటూ సాక్షి దినపత్రికలో అడ్డగోలు రాతలు రాశారని, శుద్ధ దండగ అన్న శాసన మండలి లో పదవులిచ్చి సామాజిక న్యాయాన్ని పాటించామని చెప్పుకోవడం అర్థరహితమన్నారు.

భాషకు బాషా కు  తేడా తెలియని పాలకులు

ఫిబ్రవరి 21వ తేదీని యునెస్కో ప్రపంచ మాతృభాషా దినోత్సవం గా నిర్వహిస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలోని పాలకులకు భాషకు, బాషా కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.  ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మాతృభాషలో కొనసాగించాలని  కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘనలకు పాల్పడుతోందని విమర్శించారు.

Related posts

ఆచార్యుడు, ఆరాధ్యుడు

Satyam NEWS

శ్రద్ధాను శారీరకంగా హింసించిన ఆఫ్తాబ్

Satyam NEWS

కోటయ్య మృతి:ఆనంద‌య్య మందుకు ప్రభుత్వ అనుమతి

Satyam NEWS

Leave a Comment