23.7 C
Hyderabad
May 8, 2024 04: 14 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ ఆదర్శ పాలనకు ఇది నిదర్శనం

#kcr

సుస్థిరాభివృద్దిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, “స్వచ్ఛ భారత్‌ సర్వేక్షణ ” లో మరోసారి దేశంలోనే నంబర్ వన్ గా నిలవడం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన, పారదర్శక పాలనకు మరోసారి అద్దం పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్నారు.

సమిష్టి కృషితో, పల్లె ప్రగతి’ ని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం కేసిఆర్ పునరుద్ఘాటించారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్‌ కింద పలు విభాగాల్లో తెలంగాణ రాష్ట్రం 13 అవార్డులు దక్కించుకుని, దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

ఇందుకు దోహదం చేసిన  ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని, శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని,  సర్పంచులను, ఎంపిటిసి లను, గ్రామ కార్యదర్శులను, సీఎం కేసిఆర్ ఈ సందర్భంగా అభినందించారు.” అప్రతిహత ప్రగతి తో ముందుకుసాగుతున్న  తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రగతిలో తన వంతుగా గుణాత్మక భాగస్వామ్యం పంచుకోవడం ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం. ఇదే పరంపర ను కొనసాగిస్తాం ’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Related posts

ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు

Satyam NEWS

ములుగు కోర్టులో ఘనంగా మహిళా దినోత్సవం

Satyam NEWS

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో భారీ పేలుడు

Satyam NEWS

Leave a Comment