38.2 C
Hyderabad
April 29, 2024 20: 21 PM
Slider ప్రత్యేకం

ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆకర్షణీయంగా తెలంగాణ పెవిలియన్

#telangana

భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు.. మీ కోసమే తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి హోర్డింగ్​ ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా ఉంది.  సంప్రదాయ మేళవింపుతో ఆవిష్కరణలు.. జీవ వైద్య రంగానికి  డేటా సైన్స్​ జోడీ..  ప్రతిభను ప్రతిబింబించే సాంకేతికత..  పరిశ్రమల నుంచి సమగ్రత.. స్థిరత్వం నుంచి ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుందనే తెలంగాణకున్న అనుకూలతలన్నింటినీ దీనిపై ఇంగ్లిష్​ కోట్స్​తో ప్రదర్శించారు. వేర్​ ట్రెడిషన్​ మీట్స్​ ఇన్నోవేషన్​ ట్యాగ్​ లైన్​తో ఈ ప్రత్యేక వేదికను దావోస్ లో సిద్ధం చేశారు. మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది. మన బతుకమ్మ, బోనాల పండుగలు, మన చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్​… మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్​, పోచంపల్లి ఇక్కత్​, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం టీ హబ్​.. స్కైరూట్ ఏరోస్పేస్..  విభిన్న రంగాల మేళవింపు ఉట్టిపడేలా తయారు చేసిన వాల్​ డిజైనింగ్​ ఈ పెవిలియన్​కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ప్రపంచానికి చాటిచెప్పటంతో పాటు.. ’ఇన్ వెస్ట్ ఇన్​ తెలంగాణ’ పేరుతో ముస్తాబు చేసిన ఈ పెవిలియన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ’ప్రపంచంలోనే అపారమైన అవకాశాలున్న తెలంగాణ’, ‘పెట్టుబడులకు దేశంలోనే మొట్టమొదటి  గమ్యస్థానం తెలంగాణ’ అనే నినాదాలు​ పెవిలియన్​కు స్వాగతం పలుకుతున్నాయి.

Related posts

విద్యార్థులకు మెరుగైన వైద్యo

Murali Krishna

24 గంటల వ్యవధిలో 50 మంది మృతి

Bhavani

పరిస్థితి మారుతున్నది….గమనించండి పాలకులూ

Satyam NEWS

Leave a Comment