31.2 C
Hyderabad
May 2, 2024 23: 55 PM
Slider తెలంగాణ

పోలీసుల‌ ఆర్థిక క‌ష్టాలు తీరేనా.. స‌కాలంలో జీతాలందేనా!!!

police

న్యాయానికి.. చ‌ట్టానికి.. ధ‌ర్మానికి మారు పేరే పోలీస్‌.. అని చాలా సంద‌ర్భాల‌లో విన్నాం. ఇది ముమ్మాటికీ నిజం కూడా. రాజ‌కీయ ఒడిదుడుకుల‌లో, స‌మూహాల గొడ‌వ‌ల్లో, శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో ఇలా ఎటువంటి సంద‌ర్భం అయినా పోలీసుల సేవ‌లు ఎన‌లేనివి. ఇటీవ‌ల క‌రోనా స‌మ‌యంలో నైతే పోలీసులు ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌హించిన విష‌యం కూడా ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ పోలీసుల్లో ఎంతోమంది అసువులు బాయ‌డం దుర‌ద్ర‌ష్ట‌క‌రం. ఇంత నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తున్నపోలీసులే కాదు వారి కుటుంబాలు కూడా ప‌లుమార్లు ఒత్తిడికి గుర‌వుతుంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో అయితే త‌మ పిల్ల‌ల‌ను తాము క‌లుసుకోలేక‌పోతున్నామ‌నే ఆవేద‌న కూడా క‌రోనా స‌మ‌యంలో పోలీసుల ప‌నితీరుతో తేట‌తెల్ల‌మైంది. విధి నిర్వ‌హ‌ణ‌లో ఇంత‌టి ఔచిత్యాన్నిప్ర‌ద‌ర్శించారు మ‌న తెలంగాణ పోలీసులు ఇందులో ఎలాంటి సంశ‌యం లేదు.

కాగా పోలీసుల అవ‌స‌రాల నిమిత్తం వారికి కూడా ఒక సామాన్యుడికి ఉన్న‌ట్లే అవ‌స‌రాలు ఉంటాయి. ఒక‌టో తేదీ రాగానే, ఉప్పు, పప్పు, బియ్యం, స‌రుకులు, పిల్ల‌ల చ‌దువులు, పెళ్లిళ్ళు, పేరంటాలు, రుణాలు క‌ట్ట‌డాలు, వ‌డ్డీలు ఇలా అనేక ర‌కాల అవ‌స‌రాలుంటాయి. ఆయా అవ‌స‌రాల‌కు ఇంత బిజీగా ఉన్నర‌క్ష‌క‌భ‌టులైనా త‌మ జీతాన్నేన‌మ్ముకోవాల్సి వ‌స్తోంది. కానీ కొన్ని అవ‌స‌రాల‌ను పెండింగ్‌లో వేసుకొని త‌రువాత చేసుకోవ‌చ్చ‌మె గానీ రుణాలు, వ‌డ్డీలు లాంటి అవ‌స‌రాలు మాత్రం ఠంచ‌న్‌గా క‌ట్టాల్సిందే. వాటి విష‌యంలో స‌మ‌యం మించిపోతే స‌ద‌రు ర‌క్ష‌క భ‌టుని ఆర్థిక లావాదేవీల‌పై ప్ర‌భావం ప‌డుతుంది.

1 నుంచి 5లోపు వేత‌నాలు, బెనిఫిట్స్‌ను అంద‌జేయాలంటున్నర‌క్ష‌క భ‌టులు

కాగా తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం పోలీసుల‌కు అందించే నెల‌వారీ వేత‌నం 1వ తేదీ నుంచి 8వ తేదీలోపు జ‌మ చేస్తుంది. అంతేగాకుండా టీఏ, డీఏ, అల‌వెన్సులు ఇలా వ‌చ్చే బెనిఫిట్స్ కూడా స‌కాలంలో అందితే విధి నిర్వ‌హ‌ణ‌లో ఇంత ఖ‌చ్చితంగా ఉన్నర‌క్ష‌క‌భ‌టుడి కుటుంబానికి ఆస‌రాగా నిలిచిన‌ట్ల‌వుతుంది. త‌ద్ఫ‌లితంగా అత‌ను లేదా ఆమె ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ‌దిశ‌లో ముందుంటారు. కానీ కొంత‌మంది పోలీసుల‌కు రుణాల షెడ్యూల్ తేదీలు ఐద‌వ తారీఖులోపే ఉంటున్నాయి. దీంతో స‌ద‌రు పోలీసులు ఆ ఆర్థిక సర్ధుబాటు కోసం వెంప‌ర్లాడాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా స‌ద‌రు పోలీసు ఉన్న‌తాధికారులు, రాష్ర్ట ప్ర‌భుత్వ యంత్రాంగం పోలీసు జీతాలు, వారికి అందే బెనిఫిట్స్‌, టీఏ, డీఎలు లాంటి వాటిపై ద్రుష్టి సారించి వారికి అందే ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు అందిస్తే బాగుంటుంద‌ని ప‌లువురు పోలీసులు కోరుతున్నారు. ఏది ఏమైనా శాంతిభ‌ద్ర‌త‌లు అందించే పోలీసుల విష‌యంలో కూడా ఉన్న‌తాధికారులు కాస్త క‌నిక‌రంతో వ్య‌వ‌హ‌రించాల‌ని, వారి కుటుంబాల ఆర్థిక ప‌రిస్థితుల‌క‌నుగుణంగా నిర్ణ‌యం తీసుకొని స‌కాలంలో జీత‌భ‌త్యాలు చెల్లించాల‌ని కోరుతున్నారు.

  • ప‌డ‌కంటి నాగ‌రాజు

Related posts

లాక్ డౌన్ బందోబస్తు పరిశీలించిన స్టీఫెన్ రవీంద్ర

Satyam NEWS

భక్తులతో క్రిక్కిరిసిపోయిన తిరుమల గిరులు

Satyam NEWS

కేసీఆర్ కు షర్మిల భయం పట్టుకుంది

Satyam NEWS

Leave a Comment