28.7 C
Hyderabad
May 6, 2024 01: 58 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి

#Cricket Tornament

క్రీడల్లో గెలుపోటములు సర్వసాధారణమని ప్రతి క్రీడాకారుడు ఓటమిని గెలుపుకు సోపానంగా మలుచుకొని ముందుకు సాగాలని TRS రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మంగళవారం కల్వకుర్తి మినీ స్టేడియంలో సీనియర్ క్రీడాకారుడు జహీర్ అధ్యక్షతన GSR యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్రభుత్వ సహకారాన్ని పొందుతూ ముందుకు వచ్చి జీతంలో రాణించాలని అన్నారు.

గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. ప్రతి యువకుడు వివేకానందుని అడుగుజాడల్లో నడవాలని అన్నారు.

పదిహేను రోజులుగా క్రీడా స్ఫూర్తి తో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. జిల్లా క్రికెట్ పోటీల్లో మొదటి బహుమతి రూ/-20000 పొందిన దారుసలాం జట్టుకు గోలి శ్రీనివాస్ రెడ్డి  ట్రోపి  షీల్డ్ ను అందించారు.

అదేవిధంగా  రెండవ స్థానంలో నిలిచిన జట్టు కు కౌన్సిలర్ కుడుముల కిషోర్ రెడ్డి బహుమతిని రూ/- 10000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మునిసిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సింగం విజయ్ ఉప సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు గుమ్మకొండ రాజు స్వేరోస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ నాగేష్,

కూన స్కైలాబ్ కల్వకుర్తి క్రికెట్ అసోసియేషన్ నాయకులు వీరెడ్డి మధు సుధాకర్ అలకుంటా వెంకటేష్ క్రీడాకారుడు మాజీ సర్పంచ్ మేకల శ్రీనివాస్,సుభాష్, తిరుపతయ్య,

పంచాయితీ కార్యదర్శి రమేష్,జమ్ముల శ్రీకాంత్ కిషోర్,శ్రీను, స్వేరోస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రమేష్ ఆర్గనైజరులు షఫీ వార్షిత్ కృష్ణకాంత్ బబులు, తదితరులు  పాల్గొన్నారు.

Related posts

రేవంత్ రెడ్డిని అడ్డుకోవడం మంచిపని కాదు

Satyam NEWS

దగా పడ్డ రైతుకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే

Bhavani

వలస కార్మికులను స్వస్థలాలకు వెళ్లనివ్వాలి

Satyam NEWS

Leave a Comment