38.2 C
Hyderabad
April 29, 2024 14: 37 PM
Slider వరంగల్

ములుగులో ఘనంగా జాతీయ యువజన దినోత్సవం

#Swamyvivekananda

స్వామి వివేకానంద  జయంతి సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ములుగు కార్యాలయంలో జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు.

సెక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గా బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ యువత కే కాకుండా యావత్ ప్రపంచ యువతకు వివేకానంద మార్గదర్శక మని , ఆయన జీవన విధానం యువతకు ఆచరణీయం, ఆదర్శనీయమని చెప్పారు . 

సర్వ మతాల లో కెల్లా హైందవ ధర్మం గొప్పదని సర్వమత సమ్మేళనం చికాగో సదస్సులో ప్రపంచానికి చాటారని అన్నారు.

రామకృష్ణ పరమహంస శిష్యుడిగా గురుశిష్య అనుబంధ ఔన్నత్యాన్ని జగతికి చాటి చెప్పారని ఆయన తెలిపారు. పెడదారి పడుతున్న యువతరం వివేకానంద బోధనలతో జాతీయ సేవకు పునరంకితం కావాలని, యువత బలమే దేశానికి బలం అని చెప్పారు.

పాఠశాల విద్యార్థులు వివేకానంద జీవిత చరిత్రను అవగాహన చేసుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ సూపరిండెంట్  వాజిద్ హుస్సేన్ సిబ్బంది కిరణ్ , నూరుద్దీన్ , బద్రి ప్రసాద్ , ఫిరాసత్ , కిరణ్ కుమారి ,ఏ పీ ఓ సాంబయ్య ,DCEB అసిస్టెంట్ సెక్రటరీ విక్రమ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్ర గెజిట్‌తో జల సంక్షోభం

Sub Editor 2

లాక్ డౌన్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

విశ్వ మానవ వీణ మీద..

Satyam NEWS

Leave a Comment