36.2 C
Hyderabad
April 27, 2024 22: 59 PM
Slider వరంగల్

మేడారం జాతరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం

#medaramjatara

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని, ఈ సౌకర్యాన్ని మేడారం జాతరకు వచ్చే మహిళలందరికి ఉచిత బస్సు సౌకర్యాన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో మేడారం మహా జాతరపై అధికారులతో రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ముందుగా మేడారం సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి  మంత్రి సీతక్క  మాట్లాడారు.  ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అయిన మేడారం జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పడిన పదిరోజుల్లోనే రూ.75కోట్ల నిధులు మంజూరీ చేసి భక్తుల సౌకర్యార్థం అభివృద్ది పనులను చేపట్టడం జరిగిందని, ఈ పనుల విషయంలో నాణ్యతపై రాజీపడేది లేదని అన్నారు.

మేడారం ప్రాంతంలో వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని, వాటి కోసం మేడారం నిధులతో అభివృద్ది పనులు జరుపుతున్నామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ది పనుల కోసం రూ.75కోట్లను విడుదల చేయగా టెండర్ల ద్వారా పనులు చేపట్టినట్లు తెలిపారు. మరిన్ని నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరగా రూ.35కోట్లను మంజూరీ చేశారని అన్నారు. భిన్నాభిప్రాయాలు లేకుండా అందరు సహకరించి జాతరను విజయవంతం చేయాలని అన్నారు. శాశ్వత పనులను జరిపించేందుకు  ప్రభుత్వం ధృఢ నిశ్చయంతో ఉందని అన్నారు.

అభివృద్ది పనుల విషయంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించేలా అధికారులు చూడాలని అన్నారు. కాంట్రాక్టర్లకు వంత పాడే అధికారులపై చర్యలు చేపడతామని మంత్రులు హెచ్చరించారు. శాశ్వత పనుల నిర్వహణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందని, రాబోయే జాతరలో మరిన్ని నిధులు కేటాయించి మేడారంను అభివృద్ది చేస్తామని అన్నారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డలుగా మంత్రి సురేఖతో పాటు తాను దిగ్విజయం చేసేందుకు కృషి చేస్తామని సీతక్క అన్నారు.

కేంద్ర ప్రభుత్వం మేడారం మహా జాతరకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి జాతీయ హోదా కోసం కృషి చేయాలని అన్నారు. మహా జాతర అంటే ఎన్ని సౌకర్యాలు కల్పించినా అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని, వాటిని తన దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

2014 మేడారం మహా జాతరలో సమ్మక్క-సారలమ్మలు గద్దెనెక్కిన రోజు, తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం అయిన రోజు ఒక్కటే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కూడా తల్లుల దీవెనలతోనే ఏర్పడిందని, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జరిగే మహా జాతరకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీతక్క పేర్కొన్నారు.

వరంగల్‌ ఆడబిడ్డలుగా జాతరను విజయవంతం చేస్తాం

రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మేడారం మహా జాతర వరంగల్‌ ఆడబిడ్డలుగా, మంత్రులుగా కొనసాగుతున్న తమ అదృష్టంఅని , జాతరను విజయవంతం చేసేందుకు సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో మంత్రి సీతక్కతో కలిసి పని చేస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు.

భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ది పనులన్నింటిని 100 శాతం మేరా నెలాఖరు వరకు పూర్తి చేస్తామని అన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, ప్రజాదనం దుర్వినియోగం కాకుండా చూస్తూ అధికారుల వెంట పడి పరిగెత్తించి పనులు పూర్తి చేయిస్తామని అన్నారు. దేవాలయ శాఖ నుండి రూ. 1కోటి 50లక్షలతో పూజారుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతిసే విధంగా విమర్శలు చేయడం బావ్యం కాదని అన్నారు. ప్రతిపక్షాలకు విమర్శించే హక్కు లేదని, సలహాలు, సూచనలు అందించి జాతర విజయవంతానికి సహకరించాలని అన్నారు.

గత ప్రభుత్వ హయంలో యాదాద్రి దేవాలయంలో అభివృద్ది పేరిట మూల విరాట్‌ను కదిలించి యాదాద్రిని నిర్మించారని, అది శాస్త్రీయ పరంగా తప్పిదమని కొండా సురేఖ అన్నారు. గిరిజన జాతరలో పూజారుల పాత్ర కీలకమని, వారి కోసం ప్రభుత్వం 10గదులతో అతిథి గృహ నిర్మాణం చేపడుతుందని, వచ్చే మిని జాతర నాటికి అతిథి గృహాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి సురేఖ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,

ఎస్పీ శభరిష్ , అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ఐ,టిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) పి శ్రీజ , అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్  దేవాదాయ శాఖ  కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ మృతి

Satyam NEWS

పాఠశాలలో  కాలనిర్ణయ పట్టిక ప్రకారమే నిర్వహించాలి

Satyam NEWS

మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం

Satyam NEWS

Leave a Comment