38.2 C
Hyderabad
April 29, 2024 12: 34 PM
Slider విజయనగరం

కోవిడ్ దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కారానికి ఇక “టెలి-స్పందన”

#deepikaips

విజయనగరం జిల్లాలో రోజు రోజుకు కోవిడ్ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు నిర్వహిస్తున్న “స్పందన” కార్యక్రమంను తాత్కాలికంగా నిలిపివేసి, ఇకపై ప్రతీ సోమవారం “టెలి స్పందన” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక  తెలిపారు.

“టెలి-స్పందన” కార్యక్రమంతో ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఇందు కోసం 08922-276163ఫోను నంబరును ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంను తాత్కాలికంగా నిలుపుదల చేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకుగాను ఇక పై ప్రతీ సోమవారం ఉదయం 10-30 గంటల నుండి మద్యాహ్నం 1-00 గంట వరకు “టెలీ స్పందన” నిర్వహిస్తామన్నారు.

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న కారణంగాను, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల సమస్యల పరిష్కారానికి టెలి స్పందన కార్యమ్రాన్ని నిర్వహించి, ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. కావున, ప్రజలు తమ సమస్యలను లేదా ఫిర్యాదులను 08922-276163కు ఫోను చేసి ఫిర్యాదు చెయ్యవచ్చునని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ ఫోను నంబరుకు ప్రజలు చేసే ఫిర్యాదులను స్వీకరించి, రిజిష్టరులో నమోదు చేసుకొని, సంబంధిక అధికారులకు తెలియపర్చి, వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. కావున,జిల్లాలో కోవిడ్ ప్రభావం తగ్గేంత వరకు ప్రజలెవ్వరూ జిల్లా పోలీసు కార్యాలయానికి రాకుండానే పైన తెలిపిన ఫోను చేసి, ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక కోరారు.

Related posts

తాగునీటికి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు

Satyam NEWS

ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో రూ. 114 కోట్ల స్కామ్ : మంత్రి అమర్నాథ్

Bhavani

5 నుండి 7వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

Satyam NEWS

Leave a Comment