42.2 C
Hyderabad
May 3, 2024 17: 02 PM
Slider హైదరాబాద్

తెలుగు భాష ఉన్నతికి పద్యపఠనం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 100 తెలుగు సంఘాల సమన్వయఁతో చిగురుమళ్ళ శ్రీనివాస్ వందే విశ్వమాతరమ్ పేరుతో నిర్వహిస్తున్న 100 దేశాలలో శాంతి సద్భావనా యాత్ర భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షలమఁది విద్యార్థులతో అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన సందర్భంగా సరూర్ నగర్, లింగోజిగూడా ధర్మపురికాలనీలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో “అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన పాఠశాల విద్యార్థులు పఠించి ఎందరినో మంత్ర ముగ్ధుల్ని చేశారు. ఎందరో విద్యార్థులను ఉపాధ్యాయులను అలరించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొరుప్రోలు హరనాథ్, ఆత్మీయ అతిథిగా ఏ. రామచంద్రరావు పాల్గొన్నారు. హరనాథ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా గ్రంథాలయాలకు వెళ్ళి పుస్తక పఠనం చేయాలని దానివలన కవులు, రచయితలు I.A.S.I.P.S లు కాగలరని విద్యార్థులకు సూచిస్తూ, సెల్ ఫోన్ ను ఎంత తగ్గిస్తే అంత మంచిదని సూచించారు. ముఖ్య అతిథి వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థి విద్యార్థినులకు సర్టిఫికెట్, మెమోంటోలతో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్స్ పాల్ ఏ. నవీన్ కుమార్ ఇంచార్జ్, అరుంజ్యోతి తెలుగు టీచర్ డి.స్వయంప్రభ, లతా టీచర్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని U.S.లో ఉన్న పాఠశాల ఆలపాటి కామేశ్వరరావు వీక్షించారు.

Related posts

క్రిప్టోకరెన్సీతో మనీలాండరింగ్ ప్రమాదం తప్పదు

Satyam NEWS

మన ఊరు-మన పోరు విజయవంతంతో కొల్లాపూర్ కాంగ్రెస్ లో నయా జోష్

Satyam NEWS

ఆంధ్రమహిళా సభలో కంటి స్క్రీనింగ్ క్యాంపు

Satyam NEWS

Leave a Comment