33.7 C
Hyderabad
April 30, 2024 00: 47 AM
Slider విజయనగరం

పోలీసు ల అదుపులో టెంపుల్ చోరీల నిందితుడు…!

#police

ప్రస్తుత స్పీ డ్ ను.. అదీ సాంకేతిక పరిజ్ఞానంతో వరుస టెంపుల్ చోరీకి పాల్పడిన నిందితుడిని విజయనగరం వన్ టౌన్ పోలీసు లు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ విషయాన్ని విజయనగరం సర్కిల్, పరిధిలో వన్ టౌన్ సీఐ డా. వెంకటరావు తన స్టే షన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. విజయనగరంలో మూడు చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడు అయిన ద్వారపూడి గ్రామానికి చెందిన  నిందితుడు బెల్లాన బాలరాజు (24 )  అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లు గా వన్ టౌన్ సిఐ డా. బి.వెంకటరావు  తెలిపారు.

ఈ సందర్భంగా సిఐ బి. డా వెంకటరావు మాట్లాడుతూ ద్వారపూడి కి చెందిన బెల్లాన బాలరాజు చెడు వ్యసనాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాదన్నారు. విజయనగరం పట్టణంలోని  కే.ఎల్.పురం రాధాకృష్ణ మందిరం లోను, గొకపేట పైడితల్లి అమ్మవారి గుడిలోను, కే.ఎల్.పురం యాతపేట లోని ఒక ఇంటిలోను దొంగతనాలకు పాల్పడి నారన్నారు. కె.ఎల్.పురం కోవెలలో దొంగతనం పాల్పడినట్లుగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకొని, విచారణ చెయ్యగా, మూడు చోరీలకు పాల్పడినట్లు గా అంగీకరించాడని తెలిపారు.

నిందితుడి వద్ద నుండి 3,500/- ల నగదు, పావు తులం బంగారం, 15 తులాల వెండి వస్తువులను మూడు కేసుల్లో రికవరీ చేశామని సిఐ తెలిపారు. ఈ కేసుల్లో ఎస్ఐ గోపాలరావు, హెచ్.సి. ఎం.అచ్చిరాజు, శ్రీను, శివ, శంకర్, గౌరీ శంకర్ చురుకుగా పని చేశారని, వారిని సిఐ బి వెంకటరావు అభినందించారు.

Related posts

ఆర్టీసీ ఆస్తుల వివరాలడిగిన గవర్నర్‌

Satyam NEWS

రిటర్నింగ్ అధికారిని చంపుతామని బిజెపి భయపెట్టింది

Satyam NEWS

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత

Satyam NEWS

Leave a Comment