30.7 C
Hyderabad
April 29, 2024 03: 17 AM
Slider నిజామాబాద్

అధికారం ఉంటే ఏదైనా చేస్తారా..?

#kamareddy

అధికారం ఉంటే ఏదైనా చేస్తారా.. ఏ భూములనైన కబ్జా చేస్తారా అని కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామస్తులు ప్రశ్నించారు. గ్రామంలో శివాలయం కడతాము.. భూమి కావాలంటే ఇచ్చాం.. అదే మా తప్పా.. ఇప్పుడు ఆలయం కట్టకపోగా ఆ భూమిలో వెంచర్ చేసి అమ్మేస్తారా.. ఇదేనా మీరు చేసేది అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామంలో కేదారినాథ్ ఆలయం వారు శివాలయం నిర్మిస్తామంటే గ్రామస్తులు 3.15 ఎకరాల భూమి ఇచ్చారు. ‘ఎన్నో చోట్ల భూములు చూసాం. ఇక్కడ స్థలం ఆలయ నిర్మాణానికి అనువుగా ఉంది. ఆలయం నిర్మిస్తే గ్రామానికి కూడా మంచి జరుగుతుంది’ అంటే మంచిదే కదా అని భూములు ఇచ్చామని గ్రామస్తులు తెలిపారు. 2010 లో గ్రామంలోని 155/9/బి సర్వే నంబరులో 2.33 ఎకరాల భూమిని మొదటగా ఇచ్చామన్నారు.

గ్రామ పంచాయతీ వద్ద గుమిగూడిన ప్రజలు

తర్వాత స్థలంకు వాస్తు కలిసి రావడం లేదంటే పక్కనే ఉన్న 147 సర్వే నంబరులో 0.22 గుంటల భూమిని ఇచ్చాము. ఆలయం నిర్మాణం కోసం ఆ స్థలంలో నవగ్రహ పూజా, చక్రబంధం, హోమం, యజ్ఞం చేశాం. 108 నాగళ్లతో పూజలు చేపట్టాము. హోమం చేసిన స్థలంలో 9 నుంచి 11 శివలింగాలు కూడా ఉంచాం. ఇప్పుడు తవ్వితే ఆ శివలింగాలే సాక్షాలుగా నిలుస్తాయి అని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు గ్రామ సర్పంచ్ భర్త జనార్దన్ రెడ్డి ఆ స్థలం నేను ఏడాది క్రితం కొన్నానని, ఆ భూమిని చదును చేసి వెంచర్ గా మార్చి ప్లాట్స్ విక్రయానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇది అన్యాయం అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ భర్త అయితే ఆయన వెనక నాయకుల అండ ఉంటే ఏదైనా చేస్తారా అనే నిలదీశారు. ఇప్పుడు ఆ భూమి సుమారు రెండున్నర కోట్ల విలువ చేస్తుందని, అందుకే దానిపై కన్నేసారని ఆరోపించారు. ఆలయ నిర్మాణం కోసం ఇచ్చిన భూమి ఆలయం కోసమే వినియోగించాలని డిమాండ్ చేశారు.

గురువారం పలువురు మీడియా ప్రతినిధులను గ్రామానికి పిలిచి తాము ఆలయం కోసం ఇచ్చిన స్థలంలో సర్పంచ్ వెంచర్ కోసం చదును చేసిన విధానాన్ని చూపించారు. పూజా కార్యక్రమాలు చేసిన స్థలాన్ని, శివలింగాలు ఉన్న స్థలాన్ని చూపించారు. ఆలయం నిర్మాణం కోసమే ఈ స్థలాన్ని ఇచ్చామని, ఇంటింటికి చందాలు వేసి ఆలయ నిర్మాణం చేస్తామని తెలిపారు. అంతేకాని ఈ భూమిని ఎవరికి దక్కనివ్వమన్నారు.

మీడియా ప్రతినిధులకు స్థలాన్ని చూపిస్తున్న గ్రామస్తులు

Related posts

గ్రామ స‌చివాల‌య కార్య‌ద‌ర్శిల‌కు విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే వార్నింగ్….!

Satyam NEWS

దొడ్డి కొమురయ్య కు సీఎం కేసీఆర్ నివాళి

Satyam NEWS

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment