37.2 C
Hyderabad
May 6, 2024 12: 51 PM
Slider ముఖ్యంశాలు

ఈ నెల 12 న పది ఫలితాలు

#government of telangana

10వ తరగతి ఫలితాలను ఈ నెల 12వ తేదీన విడుదల చేయాలని అధికారులు చూస్తున్నారు. ఈ మేరకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఫలితాల విడుదలలో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2652 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగాయి. తెలంగాణ వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.వచ్చే వారంలో విద్యార్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాల విడుదలకు అధికారులు ఒక్కొక్కటిగా ఏర్పాట్లను పూర్తిచేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇంటర్ ఫలితాలను సైతం ఈనెల 9వ తేదీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటర్​ ఫలితాలు ఇప్పటికే విడుదలవ్వాల్సింది కానీ గతంలో దొర్లిన తప్పులు రిపీట్ అవ్వొద్దని అధికారులు భావిస్తున్నారు.

Related posts

రైతు సంక్షేమంలో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

నెవర్ ఎండింగ్ డైలమో: ఎంత పని చేశావు భవానీ

Satyam NEWS

నడక నడక నడక …

Satyam NEWS

Leave a Comment