38.2 C
Hyderabad
April 29, 2024 22: 17 PM
Slider ఖమ్మం

సర్వమతాల అభివృద్దే లక్ష్యం

#puvvada

దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తుందని, క్రిస్మస్ పండుగ సంగ్లదర్భంగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి క్మిస్మస్ పండుగ కార్యక్రమంలో పాల్గోని క్రైస్తవులకు అండదండలను అందించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కోన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలలో ఆయా చర్చిల ద్వారా క్రైస్తవ సోదరులతో కలిసి గిఫ్ట్స్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఖమ్మం నగరం సహకార్ నగర్ లోని టబర్నికల్ బాప్టిస్ట్ చర్చి, రోటరీ నగర్ లోని గుడ్ షెపర్డ్ చర్చ్,  కొత్తగూడెం లోని దైవ కృపా మందిరం, శ్రీనివాస నగర్ లోని మోంట్‌ఫోర్ట్ హై స్కూల్ చర్చ్ నందు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా చర్చిల్లో ఎర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ శుభాకంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ క్రిస్మస్ సంబురాలను ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు, పండుగను సంతోషంగా జరుపుకునే విధంగా క్రైస్తవులకు కొత్త బట్టలను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా వెతికిన దొరకదని, అన్ని మతాలకు సమాన ప్రాతినిద్యం కల్పిస్తూ, హైదరాబాద్ లో క్రిస్టియన్ భవన్ నిర్మాణం కొరకు స్థలంతో పాటు, నిధులను కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు.

క్రైస్తవ సోదరులకు ఎల్లవేలలా కొండంత అండగా ఉంటానని మంత్రి పువ్వాడ హామి ఇచ్చారు. పేదల అభ్యున్నతికి అనుదినం కృషి చేస్తూ, కేవలం పండుగ కిట్ లను అందించడం మాత్రమే కాకుండా అడగక ముందే అనేక మంది పేదల అభ్యున్నతికి నిధులను మంజూరు చేస్తూ, అనుక్షణం మీకు అండగా ఉంటామన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా సర్వమతాల సమ్మేళనంగా ఉన్న భారతదేశంలో అందరి అభ్యున్నతిని కాంక్షిస్తు అన్ని మతాలను ఐక్యం చేస్తూ, అందరు సోధరభావంతో మెదిలేలా అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక అనేక పండుగలను, రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగిందని, ప్రతి క్రిస్మస్ పండుగకు పేద, భీదలకు బహుమతులను పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కోన్నారు.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో 2000 చోప్పున కిట్ లను పంపిణి చేయగా, ఖమ్మం నియోజకవర్గంలో 5వేల కిట్ లను పంపిణి చేయడం జరుగుతుందన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వం మన భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న ఓకే ఒక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మొదటి పండుగ క్రిస్టమస్ పండుగ అప్పుడే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిశ్చయించుకున్నారని, మతాలకు అతీతంగా ప్రతి పండగలో మన ప్రభుత్వం భాగస్వాములై ఒకే కుటుంబం వలే జరుపుకోవాలి  అన్నారు.

Related posts

ఫ్రేమోన్మాధి ఘాతుకం

Murali Krishna

పాఠశాలల అభివృద్ది పనులు పూర్తి చేయాలి

Murali Krishna

“గాలోడు” ఘన విజయంతో గాలిలో విహరిస్తున్న రవిరెడ్డి

Satyam NEWS

Leave a Comment