31.7 C
Hyderabad
May 2, 2024 10: 18 AM
Slider తూర్పుగోదావరి

కోనసీమ జిల్లా కు కొత్త ఎస్పీ

#Susarapu Sridhar

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా సుసారపు శ్రీధర్ నియమితులయ్యారు. గతంలో ఈయన అమలాపురం డిఎస్పీగా పని చేశారు. మంచి నిజాయితీ కలిగిన అధికారి గా పేరు ఉంది.కోనసీమ జిల్లా ఏర్పడిన అనంతరం సంవత్సరకాలంలో మూడవ ఎస్పీగా ఈయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సుధీర్ కుమార్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.

సుధీర్ కుమార్ రెడ్డి కోనసీమలో మంచి పోలీసు అధికారిగా గుర్తింపు పొందడంతో పాటు సింగం గా పీల్చుకునేవారు. కోనసీమ లో జరిగిన అల్లరిలో అనంతరం ఎస్పీగా వచ్చిన సుధీర్ కుమార్ రెడ్డి శాంతిభద్రతలు కాపాడటంలో సక్సెస్ అయ్యారు. పోలీస్ శాఖలో అవినీతి ప్రక్షాళనానికి నిరంతరం కృషి చేశారు. సంక్రాంతి సమయంలో సాంప్రదాయం ముసుగులో జరిగే జూదాలను కట్టడం చేసిన ఏకైక పోలీస్ అధికారిగా కోనసీమలో సుధీర్ కుమార్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఒకానొక సమయంలో కోనసీమ ప్రజాప్రతినిధులు అంతా ఎస్పీకి వ్యతిరేకంగా గళం విప్పారు. ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్న శాంతిభద్రతలను కాపాడడంలో కోనసీమ ప్రజలు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అంటారు.

Related posts

కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి

Satyam NEWS

త్వరలో హీరోయిన్ గా మంత్రి రోజా కుమార్తె అన్షు

Satyam NEWS

బీఆర్ఎస్ లో మ‌హారాష్ట్ర నుంచి భారీ చేరిక‌లు

Bhavani

Leave a Comment