40.2 C
Hyderabad
April 29, 2024 18: 47 PM
Slider హైదరాబాద్

ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యను పరిష్కరించాలి.

#cpi

అఖిల భారత విద్యార్థి సమైక్య (AISF) ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మల్టిపుల్ క్వశ్చన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని అమలు చేయాలని తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలపాలని ఈవెంట్స్ ని పాత పద్ధతిలోనే నిర్వహించి ఎస్సై ,కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఓయూ మెయిన్ లైబ్రరీ ఐసిఎస్ఎస్ఆర్ హాల్లో సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత సత్య నెల్లి,ఉప్పల ఉదయ్ కుమార్ వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా టిఎస్ఎల్ఆర్బి( పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు)చైర్మన్ పూర్తిగా విఫలమైందని ఉద్దేశాపూర్వకంగానే అలసత్వం వహిస్తూ అభ్యర్థులను మానసిక వేదనకు గురిచేస్తూ ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రవర్తిస్తుందని అన్నారు ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వెంటనే సమస్య పరిష్కరించాలని అన్నారు.

అదేవిధంగా తప్పుడు ప్రశ్నలను మార్కులు కలిపి ప్రశ్న పత్రాలు తయారుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మల్టిపుల్ క్వశ్చన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈవెంట్స్ విషయంలో అభ్యర్థులను గందరగోళానికి గురి చేయకూడదని అభ్యర్థులు సినిమాలాగా గ్రాఫిక్స్ లో లాంగ్ జంప్ చేసినట్టు చేయమనడం సరికాదని గతంలో ఏ విధంగా అయితే మూడు పాయింట్ ఎనిమిది మీటర్ల లాంగ్ జంప్ ఉన్నదో దానినే కొనసాగించి ఇప్పుడు ఉన్నటువంటి నాలుగు మీటర్ల లాంగ్ జంప్ ను ఎత్తివేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని అన్నారు.

ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యను పరిష్కరించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ అభ్యర్థులకు న్యాయం జరిగేంతవరకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి అండగా ఉంటుందని రేపు అనగా 31-12-2022 నాడు ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు అభ్యర్థులకు న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి అభ్యర్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

తదనంతరం పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు పి మహేష్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర, పి డి ఎస్ యు రాష్ట్ర కార్యదర్శి నామాల ఆజాద్ , పి డి ఎస్ యు విజృంభన రాష్ట్ర కార్యదర్శి అల్లూరి విజయ్ డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావేద్, వక్తలుగా విచ్చేసి ప్రసంగించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ఎల్ఆర్బి నియంతృత్వానికి ధోరణికి వ్యతిరేకంగా ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థుల న్యాయం జరిగేంత వరకు సంఘాలుగా పనిచేస్తూనే ఉమ్మడి పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రహమాన్, ఓయూ ఓయూ నాయకులు సాయి భగత్, లెనిన్, సుమన్, ప్రభాకర్, ప్రదీప్, విజయ, రోజా, మహేష్ ,దివ్య వందల మంది అభ్యర్థులు పాల్గొన్నారు.

Related posts

‘ఊర్వశి’ మరింత వృద్ధి చెందాలి: సూపర్ స్టార్ కృష్ణ

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌

Satyam NEWS

మేడారం జాతరకు వరంగల్ ఆర్టీసీ డిపో ప్రత్యేక బస్సులు

Satyam NEWS

Leave a Comment